న్యూస్‌మీట‌ర్.. టాప్ 10 న్యూస్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Nov 2019 8:00 PM IST
న్యూస్‌మీట‌ర్.. టాప్ 10 న్యూస్

1. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ

తెలంగాణ ఆర్టీసీ ఏజేసీ మళ్లీ వెనక్కి తగ్గింది. తమ డిమాండ్ల సాధన కోసం గత 50 రోజులకుపైగా పోరాడుతున్న ఆర్టీసీ కార్మికులు ఎట్టకేలకు సమ్మె విరమించారు. సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. రేపు కార్మికులందరూ విధులకు హాజరు కావాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్ధామరెడ్డి పేర్కొన్నారు. సెకండ్‌ షిప్టు వాళ్లుకూడా విధులకు హాజరు కావాలని అన్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరు కావొద్దన్నారు. రేపు ఉదయం ఆరు గంటలకు విధులకు హాజరై యాజమాన్యంపై ఒత్తిడి తేవాలని, కార్మికులు ఓడిపోలేదు…ప్రభుత్వం గెలవలేదన్నారు. మృతి చెందిన కార్మిక కుటుంబాలకు ఆర్టీసీ జేఏసీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...

2. వీడిన మిస్ట‌రీ: దీప్తిశ్రీ మృత‌దేహం ల‌భ్యం

కాకినాడలో ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్ లో మిస్ట‌రీ వీడింది. శుక్ర‌వారం నుంచి కనిపంచకుండా పోయిన చిన్నారి మృతదేహాన్ని ఇంద్రపాలెం లాకుల వద్ద ధర్మాడి సత్యం బృందం గుర్తించింది. దీప్తిశ్రీని సవతితల్లి శాంతకుమారి కిడ్నాప్ చేసి ఆ తర్వాత హత్య చేసింది. పాప మృతదేహాన్ని మూటకట్టి ఇంద్రపాలెం వంతెన వద్ద పడేసినట్లు పోలీసుల విచారణలో తెలిపింది. చిన్నారి అదృశ్యం కేసు తర్వాత 48 గంటలకు మిస్టరీ వీడింది. ఇంద్రపాలెం వంతెన వద్ద చిన్నారి దీప్తిశ్రీ మృతదేహం లభ్యమైంది. చిన్నారి దీప్తి శ్రీని తానే హతమార్చి ఉప్పుటేరులో పడేశానని దీప్తిశ్రీ సవతి తల్లి శాంతి కుమారి తెలుప‌డంతో పోలీసులు రంగ ప్ర‌వేశం గాలింపు చేప‌ట్ట‌గా, చివ‌ర‌కు మృత‌దేహం ల‌భ్య‌మైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...

3. వ‌ర్మ ఈ సారి ‘లేడి డ్రాగ‌న్’ ను వ‌దులుతున్నాడు.. మాములుగా కాదు.. ఇంటర్నేషనల్ లెవ‌ల్లో..

వివాదస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ మ‌రో కొత్త సినిమా ప్ర‌క‌టించాడు. గ‌త కొంతకాలంగా తెలుగు సినిమాల‌కే ప‌రిమిత‌మైన వ‌ర్మ‌ ఈసారి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేస్తున్నానంటూ షాక్ ఇచ్చాడు. ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ అనే ఇండో చైనీస్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నట్టు తెలిపాడు. అయితే.. ఈ సినిమా విష‌య‌మై ఇంత‌కుముందెన్న‌డూ ఊసెత్త‌ని వ‌ర్మ‌.. షూటింగ్ కూడా మొదలెట్టేసి టీజ‌ర్‌ను వదలబోతున్న‌ట్టు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...

4. ‘పోలీస్‌స్టేష‌న్ పై దండెత్తిన వైఎస్ జ‌గ‌న్’.. ఏపీ సీఎంపై ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వివాద‌స్ప‌ద ట్వీట్.!

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదిక‌గా విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. ఢిల్లీ పర్యటన ముగించుకున్న ప‌వ‌న్.. సీఎం జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా 1996 లో పౌరహక్కులు వారు ప్రచురించిన ‘క‌డ‌ప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం’ పుస్తకంలో ఏపీ సీఎం జగన్ గురించి ప్రస్తావించారంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...

5. ‘మ‌హా’సంగ్రామంలో మ‌రో ట్విస్ట్..!

ఒక‌ప‌క్క‌ మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై సుప్రీంలో వాదనలు కొనసాగుతున్నాయి. మరోపక్క సీఎంగా ఫడ్నవీస్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన వెంట డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్ కూడా ఉన్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...

6. హైటెక్ సిటీ వ‌ద్ద‌ ‘బీఎండ‌బ్ల్యూ’ బీభ‌త్సం

భాగ్య‌న‌గ‌రంలో రోజురోజుకు రోడ్డు ప్ర‌మాదాలు పెరిగిపోతున్నాయి. ఒక వైపు రాంగ్ రూట్ డ్రైవింగ్‌, మ‌రో వైపు నిర్ల‌క్ష్యంగా డ్రైవింగ్ చేయడం వ‌ల్ల ప్ర‌మాదాలు మితిమీరిపోతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగ‌కుండా ఎన్ని చ‌ర్య‌లు చేప‌ట్టినా.. ఫ‌లితం లేకుండా పోతోంది. త‌ప్ప‌తాగి వాహ‌నాలు న‌డుపుతూ అమాయ‌కుల ప్రాణాల‌ను బ‌లిగొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్‌లు చేప‌ట్టి కేసులు న‌మోదు చేస్తున్నా..మ‌ద్యం బాబుల‌ తీరు ఏ మాత్రం మార‌డం లేదు. రెండు రోజుల క్రితం న‌గ‌రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం మరువ‌క‌ముందే తాజాగా మ‌రో రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...

7. ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం

ఢిల్లీ: దేశ రాజధానిలో ఉగ్రదాడికి పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఐఈడీ బాంబులతో తిరుగుతున్న ముగ్గురు తీవ్రవాదులను పోలీసులు ఇవాళ అరెస్ట్‌ చేశారు. అరెస్ట్ అయిన తీవ్రవాదులు అస్సాంలోని గోల్‌పారా నుంచి చెందిన వారిగా పోలీసులు గుర్తించామని డీసీపీ ప్రమోద్ కుష్వాహా తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాద సంస్థ (ఐఎస్‌‌) ద్వారా ప్రభావితమయ్యారని పోలీసులు తెలిపారు. గోల్‌పారాలో ఐఈడీలతో పేలుడు ప్రయత్నిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని రంజీత్‌ అలీ, ఇస్లామ్‌, జమాల్‌గా పోలీసులు గుర్తించారు. ఢిల్లీలోనూ ఇదే తరహాలో ఉగ్ర ప్రణాళికను రచించారని పోలీసులు అనుమానిస్తున్నారు. దేశ రాజధానిలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఢిల్లీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...

8. రామగుండంలో రౌడీలకు క్లాస్‌.. ఎందుకంటే..!

మంచిర్యాల: నేరాలకు పాల్పడి జైలు నుంచి విడుదలైన నిందితులకు, సస్పెక్ట్ షీట్లు తెరవబడిన అనుమానితులకు పోలీసులు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. రామగుండం పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ ఎన్‌. అశోక్‌ కుమార్‌ నిందితులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. కొంతమంది వ్యక్తులు చట్టపరమైన కేసులు ఎన్ని సార్లు నమోదు చేసి జైలుకు పంపిన కూడా మార్పు రావడంలేదని అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ ఎన్‌. అశోక్‌ కుమార్‌ అన్నారు. నిందితులు వారి ప్రవర్తన, ప్రవృత్తి మార్చుకోకుండా అక్రమ చట్ట వ్యతిరేక ,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...

9. సమంత.. ఓ కుక్కపిల్ల కథ..!

టాలీవుడ్‌ అగ్ర కథానాయిక సమంతకు కుక్కలంటే ఎంతో ఇష్టం. సమంత భర్త నాగ చైతన్యకు కూడా కుక్కలంటే ఎంతో ప్రాణం. అందుకే రెండు కుక్క పిల్లలను ఈ టాలీవుడ్‌ దంపతులు పెంచుకుంటున్నారు. సమంత, నాగచైతన్య ఎంతో ఇష్టంగా కుక్కలను పెంచుకుంటున్నారు. అయితే తాను ప్రాణంగా పెంచుకున్న కుక్కపిల్ల చనిపోయినప్పుడు తాను ఎంత బాధపడ్డానో.. అని తెలియజేస్తూ సమంత ఎమోషనల్‌ పోస్టు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...

10. మ‌రో కీల‌క ప్ర‌యోగానికి సిద్ద‌మైన ఇస్రో..!

నెల్లూరు : చంద్రయాన్‌-2తో అంతరిక్ష పరిశోధనలో కీలక మైలురాయిని అధిగమించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తాజాగా మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్​ ధవన్​ స్పేస్​ సెంటర్​ షార్​లో పీఎస్ఎల్‌వీ-సీ47 ప్రయోగానికి సిద్ధమైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...

Next Story