ఢిల్లీ: దేశ రాజధానిలో ఉగ్రదాడికి పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఐఈడీ బాంబులతో తిరుగుతున్న ముగ్గురు తీవ్రవాదులను పోలీసులు ఇవాళ అరెస్ట్‌ చేశారు. అరెస్ట్ అయిన తీవ్రవాదులు అస్సాంలోని గోల్‌పారా నుంచి చెందిన వారిగా పోలీసులు గుర్తించామని డీసీపీ ప్రమోద్ కుష్వాహా తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాద సంస్థ (ఐఎస్‌‌) ద్వారా ప్రభావితమయ్యారని పోలీసులు తెలిపారు. గోల్‌పారాలో ఐఈడీలతో పేలుడు ప్రయత్నిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని రంజీత్‌ అలీ, ఇస్లామ్‌, జమాల్‌గా పోలీసులు గుర్తించారు. ఢిల్లీలోనూ ఇదే తరహాలో ఉగ్ర ప్రణాళికను రచించారని పోలీసులు అనుమానిస్తున్నారు. దేశ రాజధానిలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఢిల్లీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.