వివాదస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ మ‌రో కొత్త సినిమా ప్ర‌క‌టించాడు. గ‌త కొంతకాలంగా తెలుగు సినిమాల‌కే ప‌రిమిత‌మైన వ‌ర్మ‌ ఈసారి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేస్తున్నానంటూ షాక్ ఇచ్చాడు. ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ అనే ఇండో చైనీస్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నట్టు తెలిపాడు. అయితే.. ఈ సినిమా విష‌య‌మై ఇంత‌కుముందెన్న‌డూ ఊసెత్త‌ని వ‌ర్మ‌.. షూటింగ్ కూడా మొదలెట్టేసి టీజ‌ర్‌ను వదలబోతున్న‌ట్టు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు.ఇండియాలో తొలి మార్షల్ ఆర్ట్స్ సినిమా ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’. మార్షల్ ఆర్ట్స్ కింగ్ బ్రూస్లీ 80వ జయంతి సందర్భంగా నవంబర్ 27న టీజర్‌ను విడుదల చేయబోతున్నా. బ్రూస్లీ యూనివర్సల్ బర్త్ ‌టైం ప్రకారం 3.12కు టీజర్ రిలీజ్ చేస్తాం. ఈ సినిమా ట్రైలర్‌ను బ్రూస్లీ పుట్టిన చైనాలోని ఫోషాన్ సిటీలో డిసెంబర్ 13న రిలీజ్ చేస్తున్నాం అంటూ వ‌ర్మ ట్వీట్ చేశారు. వ‌ర్మ గ‌త ఇంట‌ర్వ్యూల‌లో తాను బ్రూస్లీకి వీరాభిమానిని అని పేర్కొన్న‌డు. ఈ నేఫ‌థ్యంలోనే వ‌ర్మ ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ ద్వారా బ్రూస్లీకి ట్రిబ్యూట్ ఇస్తున్న‌ట్లు తెలుస్తుంది.న్యూస్‌మీటర్ తెలుగు

Next Story