న్యూస్‌మీటర్.. టాప్ 10 న్యూస్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Dec 2019 10:03 PM IST1. హిందుత్వ ఎజెండాను వదిలిపెట్టే ప్రసక్తే లేదు
మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పటికప్పుడు కీలక మలుపులు తిరిగాయి. ఎన్నికల ఫలితాలు విడుదలైన నాటి నుంచి రాజకీయ వేడి అంతకంతకు పెరిగింది. రసవత్తర రాజకీయాల మధ్య సీఎంగా ఫఢ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఒక రోజులోనే ఫడ్నవీస్ రాజీనామా చేశారు. దీంతో ‘మహా’ రాజకీయాలు తీవ్రస్థాయికి చేరాయి. చివరకు ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేసేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...
2 . ఆ క్రికెటర్ ఓ ఇంటివాడయ్యాడు.. పెళ్లి చేసుకుంది ఓ హీరోయిన్‌ను మరి..!
టీమిండియా క్రికెటర్ మనీష్ పాండే ఓ ఇంటివాడయ్యాడు. తమిళ హీరోయిన్ అశ్రిత శెట్టిని మనీష్ పాండే నేడు వివాహమాడాడు. వీరి వివాహం ముంబాయిలోని ఓ హోటల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. పూర్తిగా వారి సంప్రదాయంలో జరిగిన మనీష్-అశ్రితల పెళ్లికి కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...
3. కాల్ సెంటర్ ఎఫెక్ట్: సీఐ సస్పెన్షన్..!
ఏపీలోని కాల్ సెంటర్ ఎఫెక్టుకు సీఐ సస్పెన్షన్‌కి గురయ్యాడు. అనంతపురం జిల్లా కదిరి టౌన్ సీఐ మల్లికార్జున గుప్తాపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో డీఐజీ సీఐని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...
4. క్రికెట్‌లో ఇంతవరకు ఎవరూ సాధించని రికార్డ్.. అంజలీ చాంద్ సాధించింది..!
టీ20ల్లో మరో సరికొత్త రికార్డ్ నమోదయ్యింది. నేపాల్ మహిళా క్రికెటర్ అంజలీ చాంద్ ఆరు వికెట్లు పడగొట్టడమే కాకుండా అసలు పరుగులే ఇవ్వకుండా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ రోజు మాల్దీవులతో జరిగిన టీ20 మ్యాచ్‌లో అంజలీ చాంద్ ఈ సరికొత్త రికార్డును నెలకొల్పింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...
5. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై సెన్సార్ బోర్డు సంచలన నిర్ణయం
వివాదాల దర్శకుడు రాంగోపాల్‌వర్మకు భారీ షాక్ తగిలింది. ఏదైన సినిమాను తెరకెక్కిస్తున్నారంటే ముందుగా వివాదాలు జరగాల్సిందే. ఆయన ఏ సినిమా తీసినా వివాదాలతోనే ముడిపడి ఉంటుంది. తాజాగా ఆయన తెరకెక్కించిన ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమా విడుదల కాకుండా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ పై కూడా అభ్యంతర వ్యక్తం చేయడంతో సెన్సార్ బోర్డు కూడా తప్పుబట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...
6. ఫోన్ కొట్టు – బిల్లు కట్టు: టెలికాం సంస్థల వీరబాదుడు
దాదాపు నాలుగేళ్ల తరువాత టెలికాం సంస్థలు రేట్ల పెంపుతో ప్రీ–పెయిడ్ వినియోగదారులపై బిల్లుల మోత మోగించేందుకు సిద్ధమయ్యాయి. వొడాఫోన్–ఐడియా, ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో సంస్థలు తమ తమ టారిఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీనితో ఇన్నాళ్లూ అనుభవించిన సౌకర్యాలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోవడం ఖాయం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...
7. నిజ నిర్ధారణ- సాయిబాబా విగ్రహానికి వైకాపా జెండా కప్పేరా?
సోషల్ మీడియాలో ఇటీవల ఒక కథనం తెగ వైరల్ అవుతోంది. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి లో ఒక సాయిబాబా గుడిలో దేవతా విగ్రహానికి వైకాపా కార్యకర్తలు పార్టీ జెండా కప్పేరన్న ఈ కథనం లో నిజమెంత? అబద్ధమెంత?.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...
8. హైదరాబాద్ దిశ అత్యాచారం, హత్య ఘటనపై తెలుగు రాష్ట్ర ప్రజలు భగ్గుమంటున్నారు. నిందితులను వెంటనే ఉరితీయాలంటూ విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఘటనకు పాల్పడిన నిందితులను 30 రోజుల్లోగా బహిరంగంగా ఉరి తీయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ… పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...
9. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో భారీ అవినీతి..!
గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్ట్‌పై చాలా అవినీతి జరిగిందన్నారు జల శక్తి మంత్రి రతన్‌లాల్ కటారియా. పోలవరం ప్రాజెక్ట్‌పై కాంట్రాక్టర్లకు అప్పటి ప్రభుత్వం రూ. 2346 కోట్ల అదనంగా చెల్లించినట్లు.. మంత్రి వెల్లడించారు. ఈ మేరకు రాజ్యసభలో వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు, విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా జవాబిస్తూ మంత్రి ఈ విషయం చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...
10. మనకు మరో శ్రీహరికోట వస్తుందోచ్!!
భారత గగన విజయానికి మరో వేదిక సిద్ధం అవుతోంది. బారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ఇప్పుడు మరో స్సేస్ పోర్టు ను ప్రారంభించబోతోంది. తమిళనాడు లోని టూటికోరిన్ వద్ద ఉన్న కులశేఖర పట్నంలో ఈ రెండో స్పేస్ పోర్ట్ ప్రారంభమౌతుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి...