'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాపై సెన్సార్ బోర్డు సంచ‌ల‌న నిర్ణ‌యం

By Newsmeter.Network  Published on  2 Dec 2019 10:57 AM GMT
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై సెన్సార్ బోర్డు సంచ‌ల‌న నిర్ణ‌యం

వివాదాల ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ‌కు భారీ షాక్ త‌గిలింది. ఏదైన సినిమాను తెర‌కెక్కిస్తున్నారంటే ముందుగా వివాదాలు జ‌ర‌గాల్సిందే. ఆయ‌న ఏ సినిమా తీసినా వివాదాల‌తోనే ముడిప‌డి ఉంటుంది. తాజాగా ఆయ‌న తెర‌కెక్కించిన 'క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప రెడ్లు' సినిమా విడుద‌ల కాకుండా నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ పై కూడా అభ్యంత‌ర వ్య‌క్తం చేయ‌డంతో సెన్సార్ బోర్డు కూడా త‌ప్పుబ‌ట్టింది. తాజాగా ఈ సినిమా స‌ర్టిఫికెట్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు సెన్సార్ బోర్డు నిర్ణ‌యం తీసుకుంది. కాగా, హై కోర్టు న్యాయవాది బాలాజీ యాలమంజుల, ఇంద్రసేన చౌదరి లు హై కోర్టు లో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌ను పరిగణలోకి తీసుకున్న కోర్టు, సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని భావించి, సినిమాకు సంబంధించిన స‌ర్టిఫికెట్‌ను ర‌ద్దు చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేర‌కు సెన్సార్ బోర్డు సినిమా ను సర్టిఫికెట్ ను రద్దు చేసిన‌ట్లు న్యాయవాది బాలాజీ పేర్కొన్నారు.

కాగా, కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా టైటిల్ ని అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా మార్చిన సంగ‌తి తెలిసిందే. కొన్ని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టైటిల్ ని మార్చినప్పటికీ, సెన్సార్ బోర్డు మాత్రం సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఆదివారం సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాను వీక్షించారు. సినిమాలో ప్రముఖులపై అస‌భ్య‌క‌ర‌మైన‌, కించపరిచే సన్నివేశాలు ఉండటంతో సర్టిఫికెట్ ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది.

Next Story