భారత గగన విజయానికి మరో వేదిక సిద్ధం అవుతోంది. బారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ఇప్పుడు మరో స్సేస్ పోర్టు ను ప్రారంభించబోతోంది. తమిళనాడు లోని టూటికోరిన్ వద్ద ఉన్న కులశేఖర పట్నంలో ఈ రెండో స్పేస్ పోర్ట్ ప్రారంభమౌతుంది. దీని కోసం ఇప్పటికే భూసకరణ పనులు మొదలయ్యాయి. ప్రపంచంలో అంతరిక్ష పరిశోధన దేశాలన్నిటికీ పలు స్పేస్ పోర్టులు ఉన్నాయి. శ్రీహరికోట తరువాత ఇది రెండోది అవుతుంది. మరి కొన్ని కూడా ఇలాగే త్వరగా ఏర్పడబోతున్నాయి. ఈ విషయాన్ని ఇస్రో డైరక్టర్ డా. శివన్ తెలియచేశారు.

ఈ తరహా స్పేస్ పోర్టులు ఎస్ ఎస్ ఎల్ వీ రాకెట్లను అంతరిక్షంలోకి పంపించేందుకు చాలా ఉపయోగపడతాయి. ఒకసారి ఈ స్పేస్ పోర్టు పూర్తయ్యాక ఎస్ ఎస్ ఎల్ వీ లాంచింగ్ లు అన్నీ ఇక్కడే జరగబోతున్నాయి. 2020 నాటికి ఎస్ ఎస్ ఎల్ వీ ద్వారా 500 కేజీల బరువున్న ఉపగ్రహాలను ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ స్పేస్ పోర్ట్ నుంచి నేరుగా దక్షిణం వైపు రాకెట్లను లాంచ్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఎక్కువ పేలోడ్ ను మోసుకువెళ్లడానికి వీలవుతుంది. శ్రీహరికోట నుంచి నేరుగా దక్షిణం వైపు సందించడంలో ఇబ్బందులున్నాయి. ఇవి తక్కువ పేలోడ్ తో శ్రీలంక మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ సమస్య ను టూటికొరిన్ నుంచి రాకెట్లు సంధించడం ద్వారా అధిగమించవచ్చునని శివన్ అన్నారు.

Next Story