న్యూస్ మీటర్.. టాప్ 10 న్యూస్
By అంజి Published on 18 Jan 2020 9:22 PM IST1.‘కమ్యునిస్టులూ’.. మీకు అర్ధమవుతుందా..?
ప్రస్తుత ఏపీ రాజకీయాలు సీఎం జగన్ వర్సెస్ – ఇతర పార్టీలుగా ఇప్పుడు మారిపోయాయి. పూర్వం వారి పెద్దలు రాసిన సిద్ధాంతాలు అడ్డు వస్తుండటంతో కమ్యునిస్టులు నేరుగా కొందరితో కలిసేందుకు మొహమాటపడుతున్నారేగానీ, రాజకీయ ముఖ చిత్రం మాత్రం స్పష్టంగానే ఉంది. ఏది ఏమైనా సరే జగన్‌ను దెబ్బ తీయాలన్నదే ఇప్పుడు అన్ని పార్టీల ఉమ్మడి జెండా. ఈ ఎజెండా అమలుకు సూత్రధారి పెద్దన్న చంద్రబాబే అన్నది అందరికి తెలిసిందే...పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..!
2. వెంటనే జరిమానాలు కట్టండి.. జీహెచ్‌ఎంసీ నోటీసులు
హైదరాబాద్: నగరంలో నిబంధనలు అతిక్రమించి పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారికి బల్దియా అధికారులు గట్టిగా ఝలక్ ఇచ్చారు. నిబంధనలు పాటించకపోవడంతో పలు కంపెనీలకు బల్దియా భారీగా జరిమానాలు విధించింది. జరిమానా కట్టకుండా అలసత్వం చేస్తున్న టాప్ 7 సంస్థలకు జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేసింది...పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..!
3. కాళ్లు చేతులకు తాళ్లు.. దళిత విద్యార్థి అనుమానాస్పద మృతి
భూపాలపల్లి జిల్లాలో దళిత విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మృతుడు తుమ్మలపల్లికి చెందిన వంశీగా స్థానికులు గుర్తించారు. మృతదేహం కాళ్లు, చేతులకు తాళ్లు ఉండడంతో హత్యగా బంధువుల అనుమానం వ్యక్తం చేస్తోన్నారు...పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..!
4. సాయి జన్మభూమిపై వివాదం.. రేపు షిర్డీ బంద్..!
ముంబై: సాయి సమాధి మందిరం షిర్డీ.. మరి జన్మస్థలం ఎక్కడ అంటూ..? అన్నది మహారాష్ట్రలో హాట్‌టాఫిక్‌గా మారింది. పత్రియే సాయి జన్మస్థలమని శివసేన సర్కార్ కీలక వ్యాఖ్యలు చేసింది. పత్రీ గ్రామ అభివృద్ధికి సీఎం ఉద్ధవ్ థాక్రే ఆకస్మాత్తుగా రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సాయి భక్తులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..!
5. మిడతల దాడితో కుదేలైన రాజస్థాన్ రైతులు
బికనీర్ : మిడతల దాడిలో రాజస్థాన్ కుదేలైపోయింది. గడచిన 60 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా పశ్చిమ రాజస్థాన్ లోని 10 జిల్లాల్లో పంటలు పూర్తిగా నాశనమైపోయాయి. దాదాపుగా మూడున్నర లక్షల హెక్టార్లకు పైగా పంట మిడతల దాడిలో పూర్తిగా పాడైపోయింది... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..!
6. యూరోపియన్ యూనియన్ కొత్త ప్రయత్నం
యూరోపియన్ యూనియన్ ఈ వారం ఒక కీలక సమావేశం జరపబోతోంది. ఈ సమావేశంలో అతి పెద్ద అంతర్జాతీయ వాణిజ్య సమస్యపైనో, దౌత్యపరంగా చాలా కీలకమైన అంశంపైనే సభ్యదేశాలు చర్చించబోవడం లేదు. అలాగని వారు చర్చిస్తున్నది అపరధానమైన ఇష్యూకాదు. యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల ప్రతినిధులు ఏ విషయంపై చర్చించబోతున్నారో తెలుసా? .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..!
7.ఎసిడిటీతో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేయండి
ఈరోజుల్లో ఎసిడిటీతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఎసిడిటీతో బాధపడేవారు టమోటా వంటకాన్ని ఎక్కువగా తీసుకుంటే ఎంతో ఉపశమనం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా బీపీని తగ్గించే లక్షణాలు టమోటాలో పుష్కలంగా ఉన్నాయంటున్నారు. డయాబెటిక్, బీపీ, గుండె సమస్య ఉన్నవారికి మంచి ఔషధంగా పని చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..!
8. పవన్ కల్యాణ్.. నీలో ‘చేగువేరా’ చనిపోయాడా..?
హలో పవన్ కల్యాణ్ గారూ…. మీరంటే మాకెంతో ఇష్టం. మీరు కాలర్ లో మెడ మీద చెయ్యేసి అలా తడుముకుంటే పడి చచ్చిపోతాం. మీరు చిలిపిగా చూస్తే చాలు మేం పరవశించిపోయి ఈలలు వేసేస్తాం. మీరు మైకేల్ జాక్సన్ స్టెప్పులు వేస్తూంటే మేం కేకలు వేసి, కాగితాలు చించి థియేటర్లో రచ్చ రచ్చ చేసేస్తాం.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..!
9. పాటను ఫీలవ్వండి.. నా కాళ్లను చూసి కాదు..!
శిల్పాశెట్టి.. గుర్తుంది కదా..! ఒకప్పటి బాలీవుడ్ నటి.. పొడుగు కాళ్ల సుందరి. కొన్నేళ్ల క్రితం తన పొడుగుకాళ్ల అందాలతో దశాబ్దకాలం పాటు కుర్రకారును ఆకర్షించిన బామ. సరిగ్గా, అలాగే ఇప్పుడు ఓ బామ తన పొడుగు కాళ్లతో యువతను ఆకర్షిస్తుంది. ఓ అడుగు ముందుకేసి అవే నాకు అందం అంటూ ప్రచారం కూడా చేసుకుంటుంది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..!
10. క్రికెట్ కంటే ప్రాణం ముఖ్యం
పాకిస్థాన్ లో శ్రీలంక క్రికెటర్ల పై దాడి తరువాత ఆ దేశంలో పర్యటించేందుకు ఏ జట్టు ముందుకు రావడం లేదు. ఆ ఘటన జరిగి 10 ఏళ్లు కావస్తున్నా కూడా భద్రతా పరమైన కారణాలు చూపుతూ ఏ దేశం కూడా పాక్ లో ఆడడం లేదు. దీంతో తమ దేశంలో జరగాల్సిన మ్యాచులను ఇప్పటి వరకు పాకిస్థాన్ తటస్ట వేదికపై నిర్వహిస్తూ వస్తోంది. ఇటీవల శ్రీలంక జట్టు పాక్ లో పర్యటించి మ్యాచులు ఆడింది. అయితే ఆ పర్యటనకు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..!