క్రికెట్ కంటే ప్రాణం ముఖ్యం

By Newsmeter.Network  Published on  18 Jan 2020 1:41 PM GMT
క్రికెట్ కంటే ప్రాణం ముఖ్యం

పాకిస్థాన్ లో శ్రీలంక క్రికెట‌ర్ల పై దాడి త‌రువాత ఆ దేశంలో ప‌ర్య‌టించేందుకు ఏ జ‌ట్టు ముందుకు రావ‌డం లేదు. ఆ ఘ‌ట‌న జ‌రిగి 10 ఏళ్లు కావ‌స్తున్నా కూడా భ‌ద్ర‌తా ప‌ర‌మైన కార‌ణాలు చూపుతూ ఏ దేశం కూడా పాక్ లో ఆడ‌డం లేదు. దీంతో త‌మ దేశంలో జ‌ర‌గాల్సిన మ్యాచుల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు పాకిస్థాన్ త‌ట‌స్ట వేదిక‌పై నిర్వహిస్తూ వ‌స్తోంది. ఇటీవ‌ల శ్రీలంక జ‌ట్టు పాక్ లో ప‌ర్య‌టించి మ్యాచులు ఆడింది. అయితే ఆ ప‌ర్య‌ట‌నకు శ్రీలంక సీనియ‌ర్ క్రికెట‌ర్లు దూరంగా ఉండ‌డంతో జూనియ‌ర్ జ‌ట్టునే పాక్ కు పంపించింది శ్రీలంక

ఐసీసీ ప్యూచ‌ర్ షెడ్యూల్ లో భాగంగా బంగ్లాదేశ్ ఈ నెల 24 నుంచి పాకిస్థాన్ లో ప‌ర్య‌టించాలి. ఈ ప‌ర్య‌ట‌న‌లో మూడు టీ20లు, ఒక వన్డే, రెండు టెస్టుల ల‌ను బంగ్లాదేశ్ ఆడ‌నుంది. ఇదిలా ఉండ‌గా పాక్ గ‌డ్డ పై మ్యాచులు ఆడేదే లేద‌ని బంగ్లాదేశ్ సీనియ‌ర్ క్రికెట‌ర్ తేల్చి చెప్పేసారూ. ముష్ఫికర్ రహీమ్ అయితే ఓ అడుగు ముందుకు వేసి బీసీబీ(బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు)కి కి లేఖ రాసి మరీ తాను వెళ్లడం కుదరదని స్పష్టం చేశాడు.

‘పాకిస్థాన్‌లో భద్రతపై మా ఫ్యామిలీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందుకే నేను పాక్ పర్యటనకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా. గతంలో కంటే పాక్‌లో ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గానే ఉంది. కానీ.. క్రికెట్‌ కంటే జీవితం ముఖ్యం కదా..? పాక్‌లో పిచ్‌లు బ్యాటింగ్‌కి బాగా అనుకూలిస్తుంటాయి. సిరీస్‌ జరుగుతుంటే.. ఇంట్లో కూర్చోవడం కష్టమే. కానీ.. తప్పట్లేదు’ అని ర‌హీమ్ ఆలేఖ‌లో రాశాడు. ఇక ర‌హీమ్ బాట‌లోనే మ‌రికొందరు క్రికెట‌ర్లు న‌డిచే అవ‌కాశం ఉంది. దీంతో పాకిస్థాన్ లో బంగ్లాదేశ్ ప‌ర్య‌టించ‌డం అనుమానంగా మారింది. బీసీబీ(బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు) పాకిస్థాన్ సిరీస్ పై పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

Next Story