కాళ్లు, చేతులకు తాళ్లు.. దళిత విద్యార్థి అనుమానాస్పద మృతి

By అంజి  Published on  18 Jan 2020 1:18 PM GMT
కాళ్లు, చేతులకు తాళ్లు.. దళిత విద్యార్థి అనుమానాస్పద మృతి

భూపాలపల్లి జిల్లాలో దళిత విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మృతుడు తుమ్మలపల్లికి చెందిన వంశీగా స్థానికులు గుర్తించారు. మృతదేహం కాళ్లు, చేతులకు తాళ్లు ఉండడంతో హత్యగా బంధువుల అనుమానం వ్యక్తం చేస్తోన్నారు. రేగొండ మండలం కనపర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖమ్మంలోని మమత మెడికల్‌ కాలేజీలో వంశీ ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ చదువుతున్నాడు. కాలేజీ వెళ్తున్నానని ఇంటి నుంచి బయటకి వెళ్లిన వంశీ.. తమ సొంత వ్యవసాయ బావిలోనే శవమై కనిపించాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కనిపర్తిలోని తిరుపతి- రమా దంపతుల కుమారుడు వంశీ (22).

సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో వంశీ ఇంటికి వచ్చాడు. సెలవులు ముగియడంతో శుక్రవారం సాయంత్రం తాను చదువుకుంటున్న ఖమ్మం పట్టణానికి బయలుదేరాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఉదయం పొలం పనులు నిమిత్తం అటు వైపుగా వెళ్లిన కొందరికి బావిలో వంశీ మృతదేహం కనిపించింది. దీంతో వంశీ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. కాగా స్థానికులు సమాచారం అందుకున్న పోలీసులు ఘటానా స్థలానికి చేరుకున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రామంలోని సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it