వెంటనే జరిమానాలు కట్టండి.. జీహెచ్‌ఎంసీ నోటీసులు

By అంజి  Published on  18 Jan 2020 12:35 PM GMT
వెంటనే జరిమానాలు కట్టండి.. జీహెచ్‌ఎంసీ నోటీసులు

హైదరాబాద్‌: నగరంలో నిబంధనలు అతిక్రమించి పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారికి బల్దియా అధికారులు గట్టిగా ఝలక్‌ ఇచ్చారు. నిబంధనలు పాటించకపోవడంతో పలు కంపెనీలకు బల్దియా భారీగా జరిమానాలు విధించింది. జరిమానా కట్టకుండా అలసత్వం చేస్తున్న టాప్‌ 7 సంస్థలకు జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేసింది.

ది న్యాచురల్‌ హెయిర్‌ ట్రిట్మెంట్‌కు రూ.39.56 లక్షలు, ది బ్రిటీష్‌ స్పోకెన్‌ ఇంగ్లీష్‌కు రూ.33.62 లక్షలు, ది వెంకట్‌ జాబ్స్‌ ఇన్‌ ఎంఎన్సీ రూ.29.44 లక్షలు, యాక్ట్‌ ఫైబర్‌ నెట్‌కు రూ.14.19 లక్షల జరిమానా విధించారు. ది ర్యాపిడో బైక్‌ ట్యాక్సీకి రూ.13.79 లక్షలు, ది బిల్స్‌ సాఫ్ట్‌ టెక్నాలజీస్‌కు రూ.9.38 లక్షలు, ది హత్‌ వే బ్రాడ్‌బాండ్‌కు రూ.8.13 లక్షల జరిమానాలు విధించారు.

గతంలో ఫ్లెక్సీల తొలగింపుకు జీహెచ్‌ఎంసీ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టింది. అక్రమంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినవారిపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ప్లెక్సీల ఏర్పాటును జీహెచ్‌ఎంసీ సీరియస్‌గా పరిగణిస్తోంది. సీఈసీ యాప్‌ ద్వారా నిబంధనలు అతిక్రమించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై అధికారులు జరిమానాలు విధిస్తూ వస్తున్నారు. నోటీసులు జారీ చేసిన సదరు సంస్థలు తక్షణమే జరిమానా కట్టాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవీడీఎం డైరెక్టర్‌ విశ్వజిత్‌ తెలిపారు.

Next Story