ఎసిడిటీతో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేయండి

By సుభాష్  Published on  18 Jan 2020 11:56 AM GMT
ఎసిడిటీతో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేయండి

ఈరోజుల్లో ఎసిడిటీతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఎసిడిటీతో బాధపడేవారు టమోటా వంటకాన్ని ఎక్కువగా తీసుకుంటే ఎంతో ఉపశమనం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా బీపీని తగ్గించే లక్షణాలు టమోటాలో పుష్కలంగా ఉన్నాయంటున్నారు. డయాబెటిక్‌, బీపీ, గుండె సమస్య ఉన్నవారికి మంచి ఔషధంగా పని చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.

టమోటాలను ప్రతి రోజు తీసుకుంటే లివర్‌ క్యాన్సర్‌ వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని, అంతేకాకుండా లివర్‌ ఆరోగ్యం మెరుగు పడుతుందని పేర్కొంటున్నారు. టమోటలో క్యాల్షియం, ఫాస్ఫరస్‌, విటమిన్‌ సిలు అధిక మోతాదులు ఉండటం వల్ల వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయంటున్నారు. చర్మం కాంతి వంతంగా, యవ్వనంగా ఉండేందుకు టమోట ఎంతో ఉపయోగపడుతుందట.

అంతేకాకుండా బయోటిన్‌, విటమిన్‌ సి ప్రోటీన్ల ఉత్పత్తిని క్రమబద్దీకరిస్తాయి. అలాగే టమోటలో సమృద్దిగా ఉండే ఫైటో న్యూట్రియంట్లు రక్తం గడ్డకట్టకుండా కాపాడుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

Next Story