న్యూస్‌ మీటర్‌.. టాప్‌ 10 న్యూస్‌

By Newsmeter.Network  Published on  24 Jan 2020 4:30 PM GMT
న్యూస్‌ మీటర్‌.. టాప్‌ 10 న్యూస్‌

1. పదహారేళ్ల పిల్ల అల్లిన రేప్ కథ!!

ఆమెకు ఊహాశక్తి ఎక్కువ. చక్కగా కథలల్లుతుంది. కన్ ఫ్యూజ్ చేస్తుంది. ఇదే కెపాసిటీని ఫుల్లుగా ఉపయోగించి ఆ పదహారేళ్ల చిన్నది పోలీసులను పరుగులెత్తించింది. సైరన్ బండ్లు, సెర్చి లైట్లు, వెతుకులాటలు, గాలింపులు అంతా చేసిన తరువాత కానీ పోలీసులకు ఆ అమ్మడు తమను ఒక ఆటాడించిందని అర్థం కాలేదు. పటాన్ చెరు వద్ద ఉన్న అమీన్ పూర్ చెరువు వద్దకు ఆ చిన్నది తన బాయ్ ఫ్రెండ్ తో సహా వచ్చింది. మానవ సంచారం లేని ఒక మూలను వెతుక్కుంది. అయితే సాయంత్రం అయిపోయే సరికి ఇంట్లో ఏం చెప్పాలో తెలియలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రివ్యూ : ‘డిస్కో రాజా’ – డిస్కోలో ‘సౌండ్’ మాత్రమే బాగుంది

రవితేజ చేసిన కొత్త చిత్రం ‘డిస్కో రాజా’. విఐ అనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. రామ్ తళ్లూరి నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించారు. కాగా ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా లేదా అనేది రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం ! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జగన్ పిటిషన్ ను తిరస్కరించిన సీబీఐ కోర్టు

ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్ కు ఎదురుదెబ్బ తగిలింది. అక్రమాస్తుల కేసు విచారణకు శుక్రవారం నాంపల్లి కోర్టుకు జగన్ హాజరయ్యారు. తనకు ఈడీ విచారణ నుంచి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా..కోర్టు జగన్ పిటిషన్ ను తిరస్కరించింది. తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు. దీంతో జగన్ కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నన్ను దారుణంగా రేప్‌ చేశాడు: హాలీవుడ్‌ నటి

25 ఏళ్ల క్రితం తనను దారుణంగా రేప్‌ చేశారంటూ హాలీవుడ్‌ నటి అన్నాబెల్లా సియోరా కోర్టులో భావోద్వేగానికి గురయ్యారు. కోర్టు హాలులో తనపై జరిగిన దారుణాన్ని జడ్జి ఎదుట చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. కాగా, ఈమెపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణలపై గతంలో డైరెక్టర్ హార్వే వెయిన్‌స్టీన్‌పై కేసు నమోదైంది. కాని ఇప్పటి వరకు ఈ కేసులో సరైన ఆధారాలు లభించకపోవడంతో 25 ఏళ్ల పాటు విచారణ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ కేసు విచారణలో భాగంగా కోర్టులో బాదితురాలు వాదనలు వినిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భారీ టార్గెట్‌ ను ఊదేశారు..

కివీస్‌ పర్యటనలో టీమిండియా శుభారంభం చేసింది. ఆక్లాండ్‌ వేదికగా జరిగిన తొలి టీ20లో కివీస్‌ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి మరో 6 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. దీంతో ఐదు టీ20 ల సిరీస్‌ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోర్‌ 16 పరుగుల వద్ద రోహిత్ శర్మ(7; 6బంతుల్లో 1×6 ‌) సాంట్నర్‌ బౌలింగ్‌ లో టేలర్ కి క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రైతు కూలీకి రూ. 3 కోట్ల జీఎస్టీ బిల్లు : ఇదీ అసలు కథ !

సమ్మక్క ఒక గిరిజన మహిళ. ములుగు మండలంలోని ఏటూరు నాగారంలో రైతు కూలీ ఆమె. ఏదో ఎలాగోలా పొట్టపోసుకుంటుంది. కానీ ఈ మధ్యే ఆమెకు ఒక నోటీసు వచ్చింది. ఏదో ఆషామాషీ నోటీసే కదా అని తెరిచి చూస్తే ఆమె కళ్లు బైర్లు కమ్మాయి. మూడు కోట్ల రూపాయల జీఎస్ టీ చెల్లించాలని ఆ నోటీసులో వ్రాసి ఉంది. దాంతో ఆమెకు దిక్కు తోచలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మొట్టమొదటి స్పేస్ కుక్కీస్

ఆకాశంలో పెళ్లిళ్లు చేసుకునేవాళ్లనీ చూసుంటారు. పారాచూట్లతో రకరకాలుగా గిరికీలు కొడుతూ నేలమీదికి దిగొచ్చే సాహసవీరుల్నీ చూసుంటారు. సొంత విమానాల్లో గగన విహారం చేస్తూ రకరకాల రికార్డుల్ని నెలకొల్పేవాళ్లను, బద్దలుకొట్టేవాళ్లనూ చూసుంటారు. కానీ అంతరిక్షంలో అద్భుతంగా వంట చేసే వాళ్లను ఎప్పుడైనా చూశారా.. వాళ్ల గురించి కనీసం విన్నారా.. ఇదిగో మీకు మేం అలాంటి అద్భుతమైన విషయాన్ని గురించే చెప్పబోతున్నాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వారాసిగూడలో దారుణం

చిలకలగూడ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ దారుణం చోటు చేసుకుంది. వారాసిగూడలో 17 ఏళ్ల మైనర్‌ బాలికను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. బాలికపై దుండగులు అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మళ్లీ ‘ఆయనే’ రావాలి

ఎన్నార్సీ, సీఏఏ ల విషయంలో ఆందోళనలు జరుగుతుడవచ్చు… ఆర్ధిక మాంద్యం దేశాన్ని ముప్పిరి గొంటూ ఉండవచ్చు. ధరలు పెరుగుతూ ఉండవచ్చు. రాష్ట్రాల ప్రభుత్వాలు తిరుగుబాట్లు చేస్తూ ఉండవచ్చు. పలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓడిపోతూ ఉండవచ్చు. కానీ భారత దేశపు ఓటర్లు ఇప్పటికీ ప్రధానమంత్రిగా మాత్రం నరేంద్ర మోదీయే కావాలని కోరుకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నిర్భయ దోషుల చివరి కోరిక

2012, డిసెంబర్‌ 16న దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిర్భయ కేసు.. ఇప్పుడు దోషులకు ఉరిశిక్ష పడబోతోంది. దేశ చరిత్రలోనే ఒకేసారి నలుగురిని ఉరితీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నలుగురు దోషులను 3వ నెంబర్‌ జైలుకు తరలించి సీసీ పుటేజీల ద్వారా వారి ప్రవర్తనను పరిశీలిస్తున్నారు. ఇక నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించేందుకు సమయం దగ్గర పడుతుండటంతో .. మీ చివరి కోరిక ఏంటని తీహార్‌ జైలు అడడగా, వాళ్లు మాత్రం మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. మళ్లీ కూడా ఉరిశిక్ష వాయిదా పడుతుందనే భావనలో దోషులున్నట్లు జైలు అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story
Share it