వారాసిగూడలో దారుణం

By సుభాష్  Published on  24 Jan 2020 5:13 AM GMT
వారాసిగూడలో దారుణం

చిలకలగూడ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ దారుణం చోటు చేసుకుంది. వారాసిగూడలో 17 ఏళ్ల మైనర్‌ బాలికను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. బాలికపై దుండగులు అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాలిక నివాసం ఉంటున్న భవనంలో రక్తపు మరకలు ఉన్నట్లు గుర్తించారు. కాగా, ఈ కేసుకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.

రెండు అపార్ట్‌ మెంట్ల మధ్య పడివున్న బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే బాలిక నిన్న సాయంత్రం నుంచి అదృశ్యమైనట్లు తెలుస్తోంది. సంఘటన స్థలంలోని సీసీటీవీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story
Share it