రివ్యూ : 'డిస్కో రాజా' - డిస్కోలో 'సౌండ్' మాత్రమే బాగుంది
By Newsmeter.Network Published on 24 Jan 2020 8:02 AM GMTరవితేజ చేసిన కొత్త చిత్రం 'డిస్కో రాజా'. విఐ అనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. రామ్ తళ్లూరి నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించారు. కాగా ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా లేదా అనేది రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
అనాధగా పెరిగిన డిస్కో రాజా (రవితేజ) కసితో మద్రాస్ లో పెద్ద గ్యాంగ్ స్టర్ గా మారతాడు. డిస్కో రాజా లైఫ్ లోకి హెలెన్ (పాయల్ రాజ్ పుత్) వస్తోంది. డిస్కో రాజా ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం డిస్కో రాజా అన్ని వదిలేసి హెలెన్ తో లడఖ్ ప్రాంతానికి వచ్చేస్తాడు. ఈ మధ్యలో తనకు అడ్డు వచ్చిన బర్మా సేతు (బాబీ సింగ్)ను జైలుకి పంపి అడ్డు తొలిగిస్తాడు. కానీ ఆ తరువాత తన పై జరిగిన అటాక్ లో డిస్కో రాజా చనిపోయి.. మళ్ళీ ముప్పై సంవత్సరాల తరువాత డెడ్ బాడీగా రీసెర్చ్ టీంకి దొరుకుతాడు. చనిపోయిన మనుషుల్లో మళ్ళీ జీవం పోసి బతికించడానికి ఎప్పటినుంచో రీసెర్చ్ చేస్తోన్న టీమ్ (తాన్యా హోప్ బ్యాచ్) కారణంగా డిస్కో రాజా మళ్ళీ బతుకుతాడు. మరోపక్క వాసు (రవితేజ) కోసం కొంతమంది వెతుకుతూ ఉంటారు. ఇంతకీ వాసుకి డిస్కో రాజాకి ఉన్న సంబంధం ఏమిటి ? వాళ్లిద్దరూ ఎందుకు ఒకేలా వున్నారు ? అసలు 'డిస్కో రాజా'ను చంపింది ఎవరు ? వారి పై డిస్కో రాజా ఎలా పగ తీర్చుకున్నాడు ?
అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెర పై చూడాల్సిందే.
సాంకేతిక విభాగం :
వి.ఐ ఆనంద్ మంచి పాయింట్ తీసుకున్నప్పటికీ, ఆ పాయింట్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లే రాసుకోలేదు. అయితే దర్శకుడిగా ఆనంద్ పనితనం మాత్రం బాగుంది. ఇక సినిమాలో కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు. ఇక సంగీత దర్శకుడు తమన్ అందించిన పాటలు కూడా బాగున్నాయి. మెయిన్ గా డిస్కో రాజా సాంగ్ సినిమాకే స్పెషల్ గా నిలుస్తోంది. అలాగే సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఎడిటర్ ఎడిటింగ్ బాగున్నప్పటికీ.. కథనాన్ని ఇంకా సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేయాల్సింది. నిర్మాత రామ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు అద్భుతంగా ఉన్నాయి.
నటీనటులు :
మాస్ మహారాజ్ రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో ఈ సినిమాకు ఒక సరికొత్త ఎనర్జీ ఇచ్చాడు. ఇక సినిమాలోని ఇద్దరు హీరోయినన్స్ పాయల్ రాజ్ పుత్ మరియు నభా నటేష్ లు తమ పాత్రలకు తగ్గట్టుగా మంచి నటన కనబర్చారు. అలాగే ఇతర పాత్రల్లో నటించిన నటినటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా విలన్ రోల్ లో కనిపించిన బాబీ సింహా తనలోని విలన్ యాంగిల్ ను అద్భుతంగా చూపించారు. అలాగే కామిక్ పాత్రల్లో కనిపించిన కమెడియన్ సత్య, వెన్నెల కిషోర్ తమ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో కొన్నిచోట్ల బాగా నవ్వించారు.
ప్లస్ పాయింట్స్ :
రవితేజ నటన
మెడికిల్ కి సంబంధించిన గుడ్ థీమ్
కామెడీ ఎలిమెంట్స్
మనసుకు హత్తుకునే విజువల్స్
థమన్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
స్క్రిప్ట్
ఓవర్ సినిమాటిక్
సెకెండ్ హాఫ్ వచ్చే ఊహాజనితమైన సీన్స్
వరస్ట్ స్క్రీన్ ప్లే
తీర్పు :
ఓవరాల్ గా రవితేజ - వి.ఐ ఆనంద్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ స్కైఫై థ్రిల్లర్ జస్ట్ ఒకే అనిపిస్తోంది. హీరో అండ్ విలన్ల మధ్యన వచ్చే మెయిన్ సన్నివేశాలు అలాగే సినిమాలోని మెయిన్ ఎమోషన్ కూడా బాగా సినిమాటిక్ గా అనిపిస్తాయి. అయితే రవితేజమాత్రం రెండు క్యారెక్టర్స్ లో రెండు షేడ్స్ లో ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో బాగా ఆకట్టుకున్నాడు. మొత్తమ్మీద ఈ సినిమా ఒకసారి చూడొచ్చు.