పదహారేళ్ల పిల్ల అల్లిన రేప్ కథ!!

By సుభాష్  Published on  24 Jan 2020 10:51 AM GMT
పదహారేళ్ల పిల్ల అల్లిన రేప్ కథ!!

ముఖ్యాంశాలు

  • చక్కగా కథలల్లుతుంది..కన్ ఫ్యూజ్ చేస్తుంది

  • కెపాసిటీని ఫుల్లుగా ఉపయోగించిన పదహారేళ్ల చిన్నది

  • కంగారులో అతి తెలివిగా ఆలోచించి పోలీసులకు ఫోన్ చేసింది

  • పోలీసుల ప్రశ్నలకు తత్తరపడిపోయిన నిజం కక్కేసింది

ఆమెకు ఊహాశక్తి ఎక్కువ. చక్కగా కథలల్లుతుంది. కన్ ఫ్యూజ్ చేస్తుంది. ఇదే కెపాసిటీని ఫుల్లుగా ఉపయోగించి ఆ పదహారేళ్ల చిన్నది పోలీసులను పరుగులెత్తించింది. సైరన్ బండ్లు, సెర్చి లైట్లు, వెతుకులాటలు, గాలింపులు అంతా చేసిన తరువాత కానీ పోలీసులకు ఆ అమ్మడు తమను ఒక ఆటాడించిందని అర్థం కాలేదు.

పటాన్ చెరు వద్ద ఉన్న అమీన్ పూర్ చెరువు వద్దకు ఆ చిన్నది తన బాయ్ ఫ్రెండ్ తో సహా వచ్చింది. మానవ సంచారం లేని ఒక మూలను వెతుక్కుంది. అయితే సాయంత్రం అయిపోయే సరికి ఇంట్లో ఏం చెప్పాలో తెలియలేదు. దాంతో కంగారు పుట్టింది. కంగారులో అతి తెలివిగా ఆలోచించి పోలీసులకు ఫోన్ చేసింది. “నేను వెళ్తూంటే ఒక అబ్బాయి మోటర్ సైకిల్ పై వచ్చి నన్ను అల్లరి చేయబోయాడు. నువ్వు బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న విడియో క్లిప్ నా దగ్గరుందని బెదిరించాడు. నేను లాగి లెంపకాయ కొట్టాను. ఆ తరువాత ఆ అబ్బాయి మరో ఇద్దరితో ఒక కారులో వచ్చాడు. నన్ను కిడ్నాప్ చేశాడు. వాళ్లు నన్ను అమీన్ పూర్ చెరువు వద్ద నిర్మానుష్యమైన చోట పొదల చాటున రేప్ చేశారు. సాయంత్రం దాకా వారు నన్ను అలాగే పారేసి ఉంచారు. వాళ్లు వెళ్లిపోయాక నేను ఫోన్ చేస్తున్నాను” అని వాళ్లకు చెప్పింది.

ఇంకేముంది? పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. చివరికి అమీన్ పూర్ లో అమ్మాయిని చూశారు. కానీ ఖాకీలను చూసేసరికి అమ్మాయి కలవర పడింది. వాళ్ల ప్రశ్నలకు కంగారుపడింది. కల్లబొల్లి కబుర్లేవో చెప్పింది. కానీ వాటిలో పొంతన లేకపోవడంతో పోలీసులు గుడ్లురిమారు. అంతే అమ్మాయి అసలు కథ చెప్పేసింది. అసలు కథేంటంటే ఉదయం 9.30 కే అమ్మతో గొడవపడి, బాయ్ ఫ్రెండ్ తో పాటు అమీన్ పూర్ లేక్ కి వచ్చింది. సాయంత్రం ఆరున్నరకి కవర్ చేసేందుకు కథలు అల్లింది. కానీ పోలీసుల ప్రశ్నల వర్షానికి తత్తరపడిపోయిన నిజం కక్కేసింది. ఇంతకీ అమ్మాయి తండ్రి ఒక చిరుద్యోగి. ఓ పదిహేను రోజుల క్రితమే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చారట.

ఆమెను వైద్య పరీక్ష చేసిన వైద్యులు ఆమెకు రేప్ జరగలేదని, శరీరంపై ఎలాంటి గాయాలూ లేవని తేల్చారు. ఆ అమ్మాయి రెండ్రోజుల క్రితం వరకూ ఎన్నికల ప్రచారంలో రోజు కూలీగా పనిచేసిందట.

Next Story