అమీన్‌పూర్‌లో మరో ‘దిశ’ ఘటన.. సభ్యసమాజం తలదించుకునేలా..

సంగారెడ్డి జిల్లాలో మరో ‘దిశ’ ఘటన చోటు చేసుకుంది. బాలికపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. షాప్‌కు వచ్చిన బాలికను కారులో దుండగులు కారులో ఎత్తుకెళ్లారు. ఈ ఘటన అమీన్‌పూర్‌లో చోటు చేసుకుంది. బాలికను 2 కి.మీ దూరంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన దుర్మార్గులు ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. మద్యం తాగి బాలికపై గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారు. కాగా బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు 100కు డయల్‌ చేసి ఫిర్యాదు చేశారు. సకాలంలో స్పందించిన పోలీసులు ఫోన్‌ ద్వారా బాలిక ఆచూకీని కనిపెట్టారు.

ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఘటనా స్థలంలో పోలీసులు మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్యాంగ్‌ రేపు బాధితురాలి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. నిర్భయ, దిశ ఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కామాంధుల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాలిక తల్లిదండ్రులు ఓ అపార్టుమెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. ఈ ఘటన అమీన్‌పూర్‌లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే మహిళల భద్రతపై దేశ వ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దిశ నిందుతులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన తరువాత కూడా తెలంగాణలో అత్యచారాలు ఆగే పరిస్థితి ఏ మాత్రం కనిపించడం లేదు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.