కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు న్యాయశాఖ శుక్రవారం రాత్రి ఈ ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న కమిషనర్‌ అశోక్‌లవాసా ఏసీయన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు ఉపాధ్యక్షులుగా నియమితులు కావడంతో ఆయన ఈ పదవీకి రాజీనామా చేశారు.

సెప్టెంబర్‌లో ఆయన ఏడీఏ ఉపాధ్యక్ష పదవీ చేపట్టనున్న నేపథ్యంలో ఆగస్టు 31న బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌ కుమార్‌ నియమితులయ్యారు. కాగా,1984 బ్యాచ్‌ జార్ఖండ్‌ క్యాడర్‌కు చెందిన రాజీవ్‌కుమార్‌. గతంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేశారు. అంతేకాదు ఆయన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కూడా.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.