కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌కుమార్
By సుభాష్ Published on 22 Aug 2020 6:35 AM IST![కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌కుమార్ కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌కుమార్](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/08/New-Election-Commissioner.jpg)
కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు న్యాయశాఖ శుక్రవారం రాత్రి ఈ ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న కమిషనర్ అశోక్‌లవాసా ఏసీయన్ డెవలప్‌మెంట్ బ్యాంకు ఉపాధ్యక్షులుగా నియమితులు కావడంతో ఆయన ఈ పదవీకి రాజీనామా చేశారు.
సెప్టెంబర్‌లో ఆయన ఏడీఏ ఉపాధ్యక్ష పదవీ చేపట్టనున్న నేపథ్యంలో ఆగస్టు 31న బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. కాగా,1984 బ్యాచ్ జార్ఖండ్ క్యాడర్‌కు చెందిన రాజీవ్‌కుమార్. గతంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేశారు. అంతేకాదు ఆయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కూడా.
Next Story