రోజు కూలీ రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు

Worker's fate bright overnight found diamond worth lakhs in madhyapradesh. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఓ రోజుకూలీ జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది. ఓ గని నుండి 6.66 క్యారెట్ల వజ్రాన్ని సొంతం చేసుకున్నాడు.

By అంజి  Published on  25 Nov 2021 4:34 PM IST
రోజు కూలీ రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు

మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఓ రోజుకూలీ జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది. ఓ గని నుండి 6.66 క్యారెట్ల వజ్రాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ వజ్రం ధర రూ.12 నుంచి 15 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గని నుంచి వజ్రం లభించడంతో కార్మికుడు షంషేర్‌ఖాన్‌ ఇంట్లో సంబరాల వాతావరణం నెలకొంది. షంషేర్ (33) పన్నా నగరంలోని ఆగ్రా మొహల్లా ప్రాంతానికి చెందిన వాడు. అతను హిరాపూర్ టాప్రియన్ షాలో మైన్ ప్రాంతంలో 6.66 క్యారెట్ల డైమండ్ దొరికింది.

గనిలో వజ్రం దొరికిందన్న వార్త తెలిసినప్పటి నుంచి షంషేర్ ఇంట్లో సంబరాలు మిన్నంటాయి. వజ్రాన్ని సొంతం చేసుకున్న షంషేర్ బుధవారం కలెక్టరేట్‌లోని డైమండ్ కార్యాలయంలో డిపాజిట్ చేశారు. త్వరలో జరగనున్న వేలంలో ఈ వజ్రాన్ని ఉంచుతామని డైమండ్ ఆఫీస్ కు చెందిన అనుపమ్ సింగ్ తెలిపారు. వేలంలో వజ్రం అమ్మకంపై రాయల్టీని తీసివేసిన తర్వాత మిగిలిన మొత్తం వజ్రాల యజమానికి (షంషేర్) ఇవ్వబడుతుంది.

గతంలో పన్నాలోని బేనిసాగర్ మొహల్లా నివాసి అయిన రతన్ ప్రజాపతికి 8.22 క్యారెట్ల వజ్రం లభించింది. వేలంలో వజ్రం రూ.37 లక్షలకు అమ్ముడుపోయింది. ఇప్పుడు షంషేర్ కు వజ్రం లభించింది. దేశంలోనే ఏకైక డైమండ్ ఆఫీస్ అయిన పన్నా డైమండ్ ఆఫీసులో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని చెబుతున్నారు. దీని కారణంగా ఇక్కడ పనితీరు దెబ్బతింటోంది. డైమండ్ గని ప్రాంతాలను సరిగ్గా పర్యవేక్షించబడలేదు.

Next Story