కోల్‌కతాలో మ‌రో ఘ‌ట‌న‌.. పట్టపగలు కదులుతున్న బస్సులో మహిళపై..

RG కర్ మెడికల్ హాస్పిటల్‌లో మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘ‌ట‌న మరువ‌క‌ముందే మంగళవారం ఉదయం కోల్‌కతాలోని కస్బా ప్రాంతంలో కదులుతున్న బస్సులో సహ ప్రయాణీకుడు ఒక మహిళపై వేధింపులకు పాల్పడ్డాడు

By Medi Samrat  Published on  10 Sept 2024 7:27 PM IST
కోల్‌కతాలో మ‌రో ఘ‌ట‌న‌.. పట్టపగలు కదులుతున్న బస్సులో మహిళపై..

RG కర్ మెడికల్ హాస్పిటల్‌లో మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘ‌ట‌న మరువ‌క‌ముందే మంగళవారం ఉదయం కోల్‌కతాలోని కస్బా ప్రాంతంలో కదులుతున్న బస్సులో సహ ప్రయాణీకుడు ఒక మహిళపై వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. ఉదయం 9.30 గంటలకు బస్సులో మహిళ అరవడంతో.. ప్రయాణికులు నిందితుడిని పట్టుకుని కొట్టారని పోలీసు అధికారి తెలిపారు. మహిళ వయస్సు సుమారు 25 సంవత్సరాలుగా వెల్ల‌డించారు.

నిందితుడు బస్సు దిగిన తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించాడని.. అయితే సమీపంలోని వ్యక్తులు అతన్ని పట్టుకుని కస్బా పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చార‌ని అధికారి తెలిపారు. మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేసిన‌ట్లు పేర్కొన్నారు. ఆ మహిళ కస్బా నుంచి పూల తోటలో పని చేసేందుకు వెళుతోందని అధికారి తెలిపారు. ఘ‌ట‌న‌పై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

Next Story