అత్తను చంపిన కోడలు.. కారణం ఏమిటంటే..!

Woman kills mother-in-law in MP's Damoh. మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో ఒక మహిళ తన అత్తని హత్య చేసింది.

By Medi Samrat  Published on  10 Jun 2022 8:01 PM IST
అత్తను చంపిన కోడలు.. కారణం ఏమిటంటే..!

మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో ఒక మహిళ తన అత్తని హత్య చేసింది. కోడలు ఎక్కువగా ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే.. అందుకు ఆమె అత్త అడ్డు చెబుతూ వచ్చింది. అర్థరాత్రి దాటాక కూడా కోడలు మొబైల్ ఫోన్‌లో నిరంతరం మాట్లాడడాన్ని అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కోడలు అత్తను చంపేసింది. కుమారుడు అజయ్ బర్మన్ తన తల్లి అనుమానాస్పద మృతిపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాయాలతో గుర్తించారు. విచారణలో తన భార్య ఫోన్ చేసినప్పుడు తాను పనిలో ఉన్నానని, గాయపడిన స్థితిలో తన తల్లి బయట నుండి ఇంటికి వచ్చిందని చెప్పిందని అజయ్ తెలిపాడు. ఇంటికి చేరుకున్న అతను తన తల్లి చనిపోయిందని గమనించాడు.

పోలీసులు కోడలీని విచారించగా, ఆమె మొదట పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. కానీ తన అత్తగారిని చంపిన నేరాన్ని అంగీకరించింది. హట్టా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ హెచ్‌ఆర్ పాండే మాట్లాడుతూ విచారణలో నిందితురాలు తన నేరాన్ని అంగీకరించిందని తెలిపారు. మొబైల్ ఫోన్ వినియోగం గురించి తనపై భర్తకు అత్తగారు పదే పదే ఫిర్యాదు చేసేదని తెలిపింది.

కొన్ని రోజుల క్రితం, ఆమె రాత్రి మొబైల్‌లో మాట్లాడుతుండగా, ఆమె అత్త మళ్లీ భర్తకు ఫిర్యాదు చేయడంతో, అతను ఆమె నుండి ఫోన్ లాక్కున్నాడు. దీంతో ఆగ్రహించిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్తగారి తల పగులగొట్టి చంపేసింది. తర్వాత అనుమానం రావడంతో కట్టుకథను అల్లింది.













Next Story