పోలీసులపై త్రిశూలం, కత్తులతో విరుచుకుపడిన మహిళ

Woman created orgy! On seeing police, attacked with sword and said. పోలీసులపై ఓ మహిళ త్రిశూలం, కత్తులతో విరుచుకుపడింది. బీహార్‌లోని జాముయి

By Medi Samrat  Published on  8 Jan 2022 3:44 PM IST
పోలీసులపై త్రిశూలం, కత్తులతో విరుచుకుపడిన మహిళ

పోలీసులపై ఓ మహిళ త్రిశూలం, కత్తులతో విరుచుకుపడింది. బీహార్‌లోని జాముయి ప్రాంతంలో ఓ మహిళ పోలీసు బృందంపై కత్తులు, త్రిశూలంతో దాడి చేసింది. దీంతో పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేయకుండానే వెనుదిరిగారు. వీడియో వైరల్ కావడంతో, పోలీసు బృందం మరోసారి వచ్చి ఆ మహిళను అరెస్టు చేసింది. అక్రమ మద్యం విక్రయాల గురించి తెలుసుకున్న జాముయిలోని లచుడ్ పోలీస్ స్టేషన్ పోలీసులు గురువారం సునీతాదేవి అనే మహిళ ఇంటికి చేరుకున్నారు. పోలీసులు ఇంట్లోకి రావడం చూసి సునీతాదేవి ఒక చేతిలో కత్తి, మరో చేతిలో త్రిశూలం పట్టుకుని బయటకు వచ్చింది. పలుమార్లు పోలీసులపై దాడికి ప్రయత్నించింది. మహిళ ఇంట్లోకి పోలీసులను వెళ్లకుండా అడ్డుకుంది.

చేతిలో కత్తి, త్రిశూలం తీసుకుని పోలీసులను చంపేస్తానని బెదిరించింది. హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు తీసుకుని వెళతామని కూడా పోలీసులు మహిళను హెచ్చరించారు. కానీ ఆ మహిళ అవేవీ పట్టించుకోకుండా పోలీసులపైకి దూసుకువచ్చింది. తనలోకి దేవత వచ్చినట్లుగా ఆమె మాట్లాడుతూ పోలీసులను బెదిరించడం మొదలుపెట్టింది దీంతో పోలీసులు రిక్తహస్తాలతో తిరిగి వెళ్లాల్సి వచ్చింది. కానీ వీడియో వైరల్ అయిన తర్వాత పోలీసుల తీరుపై ప్రశ్నలు తలెత్తడంతో.. బృందం మళ్లీ వెళ్లి మహిళను అరెస్టు చేసింది. అరెస్టు తర్వాత, సునీతాదేవి పోలీసులపై కత్తితో ఎందుకు దాడి చేసావని ఆమెను అడగ్గా.. షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. సునీత మాట్లాడుతూ, "అప్పుడప్పుడు తన ఒంట్లోకి దేవత వస్తుంది. అందుకే అలా జరిగింది.'' అని తెలిపింది.


Next Story