మంగళవారం నాడు భారత ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌లోని అదంపూర్ వైమానిక స్థావరాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఆయన వెళ్లిన సమయంలో తీసిన పలు విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే వాటిలో ఒక చిత్రం మిగతా వాటితో పోలిస్తే ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. పాకిస్తాన్ చేసిన తప్పుడు సమాచార ప్రచారాన్ని ఒక్క ఫోటోతో మోదీ పటాపంచలు చేశారు.
ప్రధానమంత్రి మోదీ జవాన్ల వైపు చేయి ఊపుతున్నట్లు ఇందులో కనిపించింది. ఆయన వెనుక ఒక MiG-29 జెట్, చెక్కుచెదరకుండా ఉన్న S-400 వైమానిక రక్షణ వ్యవస్థ స్పష్టంగా కనిపించాయి. తన JF-17 ఫైటర్ జెట్ నుండి వచ్చిన క్షిపణులు అదంపూర్ లోని S-400 వైమానిక రక్షణ వ్యవస్థను నాశనం చేశాయనే పాకిస్తాన్ వాదనను ఇది తోసిపుచ్చడమే కాకుండా, జాతీయ భద్రత పట్ల ప్రధానమంత్రి మోదీ అచంచలమైన నిబద్ధతను కూడా సూచిస్తుంది. పర్యటన సందర్భంగా పాకిస్తాన్ చేసిన డ్రోన్, క్షిపణి దాడులను అడ్డుకుంటూ, యుద్ధ రంగంలో ఉన్న వైమానిక దళ సిబ్బందితో ప్రధానమంత్రి సంభాషించారు.