విడాకులు మంజూర‌వ్వ‌గానే నాలుగు బ‌కెట్ల పాలతో స్నానం చేశాడు..!

అస్సాం నివాసి అయిన మాణిక్ అలీ తాను "స్వేచ్ఛ"ను తిరిగి పొందానని చెప్పాడు. అందుకు అతడు ఎవరూ తీసుకొని విధంగా నిర్ణయం తీసుకున్నాడు.

By Medi Samrat
Published on : 13 July 2025 8:31 PM IST

విడాకులు మంజూర‌వ్వ‌గానే నాలుగు బ‌కెట్ల పాలతో స్నానం చేశాడు..!

అస్సాం నివాసి అయిన మాణిక్ అలీ తాను "స్వేచ్ఛ"ను తిరిగి పొందానని చెప్పాడు. అందుకు అతడు ఎవరూ తీసుకొని విధంగా నిర్ణయం తీసుకున్నాడు. పాలతో స్నానం చేశాడు. ఇంతకూ మాణిక్ అలీ ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా? తన భార్య నుండి చట్టబద్ధంగా విడిపోవడమే.. వెంటనే అతడు పాలతో స్నానం చేశాడు. అలీ తన ఇంటి బయట, నాలుగు బకెట్ల పాలతో ప్లాస్టిక్ షీట్ మీద నిలబడి స్నానం చేశాడు.

తన భార్య కు ఓ ప్రియుడు ఉన్నాడని, తనతో వివాహమై ఓ బిడ్డ పుట్టినా ఆమె తన లవర్ తో బంధం కొనసాగించిందని ఆరోపించాడు. తనను, తన బిడ్డను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయిందని చెప్పాడు. ఒక్కసారి కాదు రెండుసార్లు అలాగే వెళ్లిపోయిందన్నాడు. మొదటిసారి తప్పు చేసినప్పుడు బిడ్డ కోసం ఆమెను క్షమించానని చెప్పాడు. మళ్లీ మళ్లీ అదే తప్పు చేయడంతో భరించలేక విడాకులు తీసుకున్నానని అన్నాడు.

Next Story