భార్య మీద కోపంతో మరదలిపై అత్యాచారం

Was angry with wife, sexual Assault minor sister-in-law. రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో భార్య మీద కోపంతో తన మైనర్‌ మరదలిపైన అత్యాచారానికి

By Medi Samrat  Published on  29 Dec 2021 12:48 PM IST
భార్య మీద కోపంతో మరదలిపై అత్యాచారం

రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో భార్య మీద కోపంతో తన మైనర్‌ మరదలిపైన అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు వచ్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. బాధితురాలిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచి నారీ శాలకు పంపించాలని ఆదేశించారు. భార్య మీద కోపంతో మైనర్ అయిన మరదలిని 4 రోజుల పాటు తన వద్ద ఉంచుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ విషయంపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కనీజ్ ఫాత్మా మాట్లాడుతూ కోటలోని నయాపురా పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడికి ఏడాదిన్నర క్రితం వివాహమైందని తెలిపారు. నిందితుడు మద్యానికి బానిసై కూలి పనులు చేస్తుంటాడు. భర్త మద్యానికి అలవాటు పడడంతో మనస్తాపం చెందిన భార్య కొద్ది రోజుల క్రితం నిందితుడిని వదిలి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. నిందితుడు 17 ఏళ్ల తన మరదలిని కాలేజీ నుంచి తనతోపాటు గ్రామానికి తీసుకెళ్లాడని పోలీసులు విచారణలో తెలుసుకున్నారు.

బాలిక ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అతడి ఇంటికి చేరుకున్న పోలీసులు నిందితుడి దగ్గర నుండి బాలికను విడిపించారు. పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. భార్య మీద కోపంతో తాను మరదలిపై ఇలాంటి పని చేశానని పోలీసుల ముందు నిందితుడు ఒప్పుకున్నాడు.


Next Story