బీహార్ ఫ‌లితాల ఎఫెక్ట్‌.. హైకమాండ్‌ను కలవడానికి సమయం కోరిన ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ నేత‌లు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏల ఘనవిజయంతో షాక్‌కు గురైన ఉత్త‌రాఖండ్‌ కాంగ్రెస్ నేతలు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలవడానికి సమయం కోరారు.

By -  Medi Samrat
Published on : 15 Nov 2025 10:15 AM IST

బీహార్ ఫ‌లితాల ఎఫెక్ట్‌.. హైకమాండ్‌ను కలవడానికి సమయం కోరిన ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ నేత‌లు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏల ఘనవిజయంతో షాక్‌కు గురైన ఉత్త‌రాఖండ్‌ కాంగ్రెస్ నేతలు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలవడానికి సమయం కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులు, ముఖ్యంగా జిల్లా అధ్యక్షుల కొత్త జాబితాపై పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 2027లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ హైకమాండ్ ఈ పునర్వ్యవస్థీకరణ చేసింది. శుక్రవారం బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత.. ఉత్తరాఖండ్‌లోని కాంగ్రెస్ నేతల్లో కూడా అశాంతి స్పష్టంగా కనిపిస్తోంది.

2014 నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయం కోసం తహతహలాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వరుసగా మూడో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్‌లో విజయం బీజేపీకి బూస్టర్ డోస్‌గా మారింది. అదే సమయంలో కాంగ్రెస్ ఒత్తిడికి లోన‌వుతుంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీరియస్‌గా పనులు చేయకుంటే పార్టీ కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉందని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన దాదాపు 12 మంది నేతలు అగ్రనేతలను కలిసేందుకు సమయం కోరారు. ఈ విషయమై కాంగ్రెస్ రాష్ట్ర కో-ఇన్‌చార్జి సురేంద్ర శర్మతో సవివరంగా చర్చించినట్లు రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు, అధికార ప్రతినిధి ధీరేంద్ర ప్రతాప్ తెలిపారు. పార్టీ అగ్రనేతలతో మాట్లాడిన తర్వాత భవిష్యత్తు వ్యూహం, సంస్థాగతంపై చర్చించాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నట్లు సందేశం అందించారు. ఈ నాయకులు కూడా బీహార్ ఎన్నికల ఫలితాల గురించి ఆందోళన చెందుతున్నారు. భ‌విష్యత్తులో ఉత్తరాఖండ్‌లో ఇది పునరావృతం కాకూడదనుకుంటున్నారు.

Next Story