ప్రధాని మోదీ, యోగి ఆదిత్యనాథ్ లను చంపేస్తామంటూ ట్వీట్లు

UP Police begins probe after Twitter user threatens to assassinate PM Modi, CM Yogi Adityanath. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లను బాంబులు

By Medi Samrat  Published on  8 Nov 2021 6:24 PM IST
ప్రధాని మోదీ, యోగి ఆదిత్యనాథ్ లను చంపేస్తామంటూ ట్వీట్లు

భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లను బాంబులు పెట్టి పేల్చేస్తానంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ట్విట్టర్‌‌లో ఆదివారం పోస్ట్ చేయడంతో యూపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను చంపేస్తామంటూ బెదిరిస్తూ చేసిన ట్వీట్ గురించి పోలీస్ హెల్ప్‌లైన్‌ 112కి సమాచారం అందిందని యూపీ పోలీసులు తెలిపారు. ఆదివారం నాడు ట్విటర్ నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్‌లను బాంబుతో అంతం చేస్తానని బెదిరించడంతో యుపి పోలీసులు అప్రమత్తమయ్యారు.

ట్విట్టర్‌‌లో గుర్తు తెలియని వ్యక్తి ఎవరో కావాలని ఈ పోస్ట్ పెట్టారు. అయితే ఆ ట్విట్టర్ అకౌంట్ ఫేక్ అయ్యుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సొంత పేరుతో కాకుండా ఫేక్ యూజర్‌‌ నేమ్‌తో ఆ ఖాతాను నడుపుతున్నారని తేలింది. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. అసలైన నిందితుడిని పట్టుకునే వరకు ఆ పేరును బయటపెట్టడం సరైనది కాదని పోలీసు ఉన్నతాధికారులు చెప్పుకొచ్చారు. నిందితులను పట్టుకునే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి సమాచారం ఇవ్వాలని ఇన్వెస్టిగేషన్ టీమ్‌ ఇప్పటికే ట్విట్టర్‌‌ను సంప్రదించిందని అధికారులు తెలిపారు.


Next Story