సవతి తల్లిని చంపిన వ్యక్తికి జీవిత ఖైదు విధించిన‌ న్యాయస్థానం

ఐదు సంవత్సరాల క్రితం కుటుంబ వివాదం కారణంగా సవతి తల్లిని హత్య చేసిన కేసులో దోషిగా తేలిన వ్యక్తికి జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం.

By Medi Samrat
Published on : 27 Jun 2025 8:15 PM IST

సవతి తల్లిని చంపిన వ్యక్తికి జీవిత ఖైదు విధించిన‌ న్యాయస్థానం

ఐదు సంవత్సరాల క్రితం కుటుంబ వివాదం కారణంగా సవతి తల్లిని హత్య చేసిన కేసులో దోషిగా తేలిన వ్యక్తికి జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం. యూపీలోని బల్లియా జిల్లా అదనపు సెషన్స్ జడ్జి జ్ఞాన్ ప్రకాష్ తివారీ నిందితుడికి రూ. 10,000 జరిమానా కూడా విధించారు. అక్టోబర్ 3, 2020న రాస్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని పరాసియా గ్రామంలో హత్య జరిగింది. 45 ఏళ్ల తారా దేవి మెడపై పదునైన ఆయుధంతో దాడి కారణంగా మరణించారు.

మ‌ర‌ణానికి ముందు తారా దేవి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమె తన భర్త శ్రీభగవాన్ చౌరాసియా, సవతి కుమారుడు ధర్మవీర్ చౌరాసియా అలియాస్ పంకజ్‌లను నిందితులుగా పేర్కొంది. శ్రీభగవాన్ చౌరాసియాకు రెండు వివాహాలు జరిగాయని పోలీసులు తెలిపారు. అతని మొదటి వివాహ బంధం తర్వాత అతనికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు పంకజ్ ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇద్దరు కుమార్తెలకు ఇప్పటికే వివాహం కాగా, కుటుంబం మూడవ కుమార్తె వివాహానికి సిద్ధమవుతోంది. వివాహానికి నిధులు సమకూర్చడానికి పంకజ్ తన సవతి తల్లి తారా దేవి పేరు మీద కొనుగోలు చేసిన భూమిని అమ్మాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది.

భూమి అమ్మకం విషయంలో వివాదం తీవ్రమై, పంకజ్ తారా దేవిని పదునైన ఆయుధంతో దాడి చేయడంతో ఆమె ప్రాణాలు వదిలింది. ఇరువర్గాల వాదనలు విన్న అదనపు సెషన్స్ జడ్జి జ్ఞాన్ ప్రకాష్ తివారీ, ధర్మవీర్ చౌరాసియా అలియాస్ పంకజ్‌ను దోషిగా నిర్ధారించి, అతనికి జీవిత ఖైదుతో పాటు రూ. 10,000 జరిమానా విధించారు. ఆధారాలు లేకపోవడంతో, ఈ కేసులో తారా దేవి భర్త శ్రీభగవాన్ చౌరాసియాను కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.

Next Story