ఉద్యోగులకు రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌.. 4 శాతం డీఏ పెంపు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని దాదాపు 35 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు నాలుగు శాతం పెరిగిన కరువు భత్యాన్ని పొందనున్నారు.

By Medi Samrat  Published on  11 March 2024 9:39 AM GMT
ఉద్యోగులకు రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌.. 4 శాతం డీఏ పెంపు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని దాదాపు 35 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు నాలుగు శాతం పెరిగిన కరువు భత్యాన్ని పొందనున్నారు. డీఏ పెంపుకి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. పెరిగిన డీఏ ఏప్రిల్ లేదా మే జీతంలో ఇవ్వబడుతుంది. పెరిగిన డియర్‌నెస్ అలవెన్స్ జనవరి 1, 2014 నుండి అందుబాటులో ఉంటుందని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఈ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై దాదాపు రూ.350 కోట్ల అదనపు భారం పడనుంది. దీనికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి.

హోలీకి ముందు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ కానుకను అందించింది. గత వారం కేంద్ర ప్రభుత్వం నాలుగు శాతం డియర్‌నెస్ అలవెన్స్‌ను ప్రకటించింది. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే ఈ దిశగా నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.

రాష్ట్ర ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ ఇవ్వాలన్న ప్రతిపాదనకు శనివారం ఆమోదం లభించింది. నాలుగు శాతం పెంపుతో డియర్‌నెస్ అలవెన్స్ 50 శాతానికి పెరుగుతుంది. దీని వల్ల దాదాపు 11.5 లక్షల మంది ఉద్యోగులు, 8 లక్షల మంది ఉపాధ్యాయులు, 15.5 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.

డియర్‌నెస్ అలవెన్స్‌ని ఏప్రిల్‌లో మార్చి జీతం లేదా మే నెలలో ఏప్రిల్ జీతంతో కలిపి ఇవ్వబడుతుంది. ఎన్నికల దృష్ట్యా మార్చి జీతంలోనే నాలుగు శాతం డియర్‌నెస్ అలవెన్స్‌ను కలుపుతారని భావిస్తున్నారు.

Next Story