రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా 'జూట్ మారో ఆందోళన' ప్రారంభిస్తా : కేంద్ర మంత్రి

రిజర్వేషన్లకు సంబంధించి రాహుల్ గాంధీ ప్రకటనకు వ్యతిరేకంగా దళిత సంఘాలు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ‘జూట్ మారో ఆందోళన’ చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తెలిపారు.

By Medi Samrat  Published on  13 Sept 2024 6:03 PM IST
రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా జూట్ మారో ఆందోళన ప్రారంభిస్తా : కేంద్ర మంత్రి

రిజర్వేషన్లకు సంబంధించి రాహుల్ గాంధీ ప్రకటనకు వ్యతిరేకంగా దళిత సంఘాలు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ‘జూట్ మారో ఆందోళన’ చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తెలిపారు. ఇటీవల యుఎస్‌లోని జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో ఇంటరాక్షన్ సందర్భంగా.. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థులతో మాట్లాడుతూ.. 'భారతదేశం న్యాయమైన ప్రదేశం' అయినప్పుడే రిజర్వేషన్‌లను తీసేయ‌డం గురించి కాంగ్రెస్ ఆలోచిస్తుందని.. ప్రస్తుతం ఆ ప‌రిస్థితి లేదన్నారు.

రాహుల్‌ ప్రకటనపై అడిగిన ప్రశ్నకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అథవాలే స్పందిస్తూ.. దళితులు, ఓబీసీలు, గిరిజనుల రిజర్వేషన్లను ఎవరూ తీసివేయలేరని.. అలా చేయడానికి ప్రయత్నించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. రాహుల్ గాంధీ చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా దళిత సంఘాలు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చెప్పులతో కొట్టే ఉద్యమం చేపడతామన్నారు. రాహుల్ గాంధీపై బూట్లు విసరాలని అన్నారు. రాహుల్ గాంధీ పనికిమాలిన వ్యక్తి అని.. ఇంగ్లండ్, అమెరికా వెళ్లినప్పుడల్లా భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదని అంటున్నారు.. దేశంలో ప్రజాస్వామ్యం లేకపోతే రాహుల్ గాంధీ 99 సీట్లు సాధించి ప్రతిపక్ష నేత ఎలా అవుతారని ప్రశ్నించారు. "ప్రజలు మాకు ఆదేశాన్ని అందించారు.. NDA ప్రభుత్వం అందరినీ ముందుకు తీసుకువెళుతోంది" అని ఆయన అన్నారు. రాజ్యాంగం ద్వారా బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను అంతం చేస్తామన్న రాహుల్‌కు దేశంలోని దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు గుణపాఠం చెబుతాయన్నారు.

Next Story