ఏపీకి గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం

Union Minister Nitin Gadkari In Global Investors Summit. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పాల్గొన్నారు.

By Medi Samrat  Published on  3 March 2023 3:01 PM GMT
ఏపీకి గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం

Union Minister Nitin Gadkari


విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఏపీపై ప్రశంసలు కురిపించారు. భారతదేశంలో ముఖ్యమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటని.. అందుకే.. ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. ఏపీ మత్స్య పరిశ్రమ అత్యంత కీలకంగా మారిందని.. దీనికి ప్రభుత్వం ఇంకా సపోర్ట్ చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నాం. సరకు రవాణా ఖర్చును తగ్గించాలని ప్రయత్నాలు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్‌ పోర్ట్‌ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామ‌ని అన్నారు. మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని పేర్కొన్నారు. పోర్టులతో రహదారులను అనుసంధానం చేస్తామ‌ని వివ‌రించారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 పారిశ్రామిక కారిడార్లు రాబోతున్నాయన్న గడ్కరీ.. ఏపీలో రోడ్‌ కనెక్టివిటీ పెంచేందుకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామ‌ని హామీ ఇచ్చారు. సీఎం జగన్‌ 6 లేన్ల వైజాగ్ పోర్ట్ హైవేకు సంబంధించి ఒక ముఖ్యమైన డిమాండ్ ను చాలా కాలంగా నా ముందు ఉంచారన్న ఆయ‌న‌.. ఈ ప్రాజెక్టును మంజూరు చేస్తున్నట్లు ప్ర‌క‌టించారు. రహదారి 55 కిలోమీటర్ల మేర ఉంటుందని.. ఖర్చు రూ.6300 కోట్లు అవుతుంద‌ని పేర్కొన్నారు.


Next Story