కాశ్మీర్‌లోని మచిల్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని మచిల్‌లోని టేక్రి నార్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ వెంబడి ఆదివారం ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. వారి నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లు, రెండు పిస్టల్స్, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నామని, ఉగ్రవాదులు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
"Army and Kupwara Police neutralised two #terrorists near LoC Tekri Nar in Machil area of Kupwara. Identification of the killed terrorists being ascertained. 02 AK 47 rifles, 02 pistols & 04 hand grenades recovered. Further details shall follow." అంటూ కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.
10 రోజుల క్రితం కశ్మీర్ పోలీసులకు నిర్దిష్ట సమాచారం అందడంతో.. శ్రీనగర్ జిల్లాలోని నౌగామ్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.