ఉధంపూర్ లో కూలిన ఆర్మీ హెలికాప్టర్..

Two pilots dead as Army helicopter crash lands in Jammu and Kashmir's Udhampur. జమ్మూకశ్మీర్ ఉధంపూర్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పట్నిటాప్ వద్ద

By Medi Samrat  Published on  21 Sept 2021 5:00 PM IST
ఉధంపూర్ లో కూలిన ఆర్మీ హెలికాప్టర్..

జమ్మూకశ్మీర్ ఉధంపూర్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పట్నిటాప్ వద్ద ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్ లోని ఇద్దరు పైలట్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెలికి తీసిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఇద్దరూ మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. మేజర్ ర్యాంకు కలిగిన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించినప్పటికీ దురదృష్టవశాత్తు వారిని దక్కించుకోలేకపోయామని ఆర్మీ అధికారులు తెలిపారు. తుక్కు అయిపోయిన హెలికాప్టర్ నుంచి గాయపడ్డ పైలట్లను స్థానికులు బయటకు తీశారు. ఉదయం 10.30 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ.. ఈ వార్త వినగానే చలించిపోయానని చెప్పారు. ఇద్దరు యువ ఆర్మీ పైలట్లు, మేజర్ రోహిత్ కుమార్, మేజర్ అనూజ్ రాజ్‌పుత్, ఉధంపూర్ సమీపంలో ఈరోజు జరిగిన చీతా హెలికాప్టర్ ప్రమాదంలో విషాదకరంగా ప్రాణాలు కోల్పోయారు అని ఆర్మీ తెలిపింది.


Next Story