చీర కొంగుతో రాష్ట్ర‌ప‌తికి దిష్టితీసిన ట్రాన్స్‌జెండ‌ర్.. వీడియో.!

Transgender folk dancer receives padma shri. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును జానపద నృత్యకారిణి, ట్రాన్స్‌జెండర్‌ మంజమ్మ జోగతి

By అంజి  Published on  10 Nov 2021 11:58 AM IST
చీర కొంగుతో రాష్ట్ర‌ప‌తికి దిష్టితీసిన ట్రాన్స్‌జెండ‌ర్.. వీడియో.!

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును జానపద నృత్యకారిణి, ట్రాన్స్‌జెండర్‌ మంజమ్మ జోగతి అందుకున్నారు. అవార్డు అందుకునే సమయంలో ట్రాన్స్‌జెండర్‌ మంజమ్మ.. తనదైన రీతిలో రాష్ట్రపతిని దీవించింది. చీర కొంగుతో దిష్టి తీసి శుభం కలిగేలా దీవెనలు చేసింది. కొవింద్‌కు శుభా ఆశీస్సులు అందజేసిన తీరు అక్కడున్న వారందరిని ఆశ్చర్యపరిచింది. రాష్ట్రపతి భవన్‌లో పద్మా అవార్డుల వేడుక జరిగింది. ట్రాన్స్‌జెండర్‌ మంజమ్మకు జానపద నృత్యం క్యాటగిరీలో పద్మశ్రీ అవార్డు వచ్చింది. ట్రాన్స్‌జెండర్లు దీవిస్తే మంచి జరుగుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు.

మంజమ్మ కర్నాటన రాష్ట్రంలోని బల్లారి జిల్లాలో మంజూనాథ్‌ శెట్టిగా జన్మించారు. 10వ తరగతి వరకు చదువుకున్న మంజమ్మ.. తన 15వ ఏటా తనలో స్త్రీ లక్షణాలు ఉన్నట్లు గుర్తించింది. ఈ క్రమంలోనే ఆమె తల్లిదండ్రులు హెస్‌పేట్‌లని ఆలయానికి తీసుకువెళ్లి జోగప్ప పూజలు చేశారు. దేవతతో మంజమ్మకు పెళ్లి చేశారు. ఆ తర్వాత మంజూనాథ్‌ శెట్టి మంజమ్మ జోగతిగా మారింది. మొదట్లో చీర కట్టుకుని వీధుల్లో భిక్షాటన చేసిన మంజమ్మ ఎప్పుడూ కూడా తన సొంత ఇంటికి వెళ్లలేదు. ఎన్నో సార్లు లైంగిక వేధింపులకు గురైంది. ఓ డ్యాన్సర్‌ ఆమె కొత్త జీవితం ప్రారంభించింది. అతడి దగ్గర జోగప్ప జానపద నృత్యం నేర్చుకుంది. అప్పటి నుండి కర్ణాటక రాష్ట్రంలో ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టింది. కర్నాటక జానపద అకాడమీకి అధ్యక్షురాలిగా మంజమ్మ నియమించబడింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జానపద అకాడమీ కార్యక్రమాలను నిర్వహిస్తు వస్తోంది.


Next Story