సీఎం సభకు హాజరై తిరిగి వెళ్తూ 10 మంది దుర్మరణం

మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా ఉమ్రానాల సమీపంలో గురువారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు

By -  Knakam Karthik
Published on : 27 March 2026 7:11 AM IST

National News, MadhyaPradesh, Road Accident, Chhindwara, CM MohanYadav, Tragedy, Bus Accident

సీఎం సభకు హాజరై తిరిగి వెళ్తూ 10 మంది దుర్మరణం..బస్సు, ట్రక్కు ఢీకొనడంతో ఘోరం

మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా ఉమ్రానాల సమీపంలో గురువారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ లబ్ధిదారుల కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న బస్సు, వెల్లుల్లి లోడుతో ఉన్న పికప్ ట్రక్కును ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఎదురుగా బలంగా ఢీకొనడంతో ఈ విషాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్న ఆ బస్సు బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన ఒకరిని మెరుగైన చికిత్స కోసం నాగ్‌పూర్‌కు తరలించగా, మరో ఐదుగురు చింద్వారా జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రాథమిక విచారణ ప్రకారం అతివేగం, నిర్లక్ష్యంగా ఓవర్‌టేక్ చేయడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 1 లక్ష చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచిత వైద్యం అందించాలని, జబల్‌పూర్ నుండి ప్రత్యేక వైద్య బృందాలను పంపాలని అధికారులను ఆదేశించడమే కాకుండా, పరిస్థితిని పర్యవేక్షించేందుకు భోపాల్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి రాకేష్ సింగ్ కూడా తక్షణమే ఘటనా స్థలానికి చేరుకోవాలని సీఎం సూచించారు.

Next Story