అలా దుస్తుల పై నుండి తాకినా లైంగిక వేధింపే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Touching the girl from above the dress is sexually harassing: Supremcourt. నిందితుడు బాలిక శరీరాన్ని నేరుగా తాకకపోతే.. అది పోక్సో యాక్ట్ నిబంధనల ప్రకారం లైంగిక వేధింపుల కిందకు రాదు అంటూ ముంబై హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును
By అంజి Published on 18 Nov 2021 8:38 AM GMTనిందితుడు బాలిక శరీరాన్ని నేరుగా తాకకపోతే.. అది పోక్సో యాక్ట్ నిబంధనల ప్రకారం లైంగిక వేధింపుల కిందకు రాదు అంటూ ముంబై హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును భారత ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. బాలికను తాను వేసుకున్న డ్రెస్ మీద నుండి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపేనని జస్టిస్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పు చట్టానికి సంకుచిత వివరణ ఇచ్చేలా ఉందని పేర్కొంది. చట్టాలు వాటి ఉద్దేశాన్ని చెప్పినప్పుడు.. కోర్టులు ఆ నిబంధనల్లో గందరగోళం చేయకూడదు. కోర్టులు సందిగ్ధతను సృష్టించడంలో అత్యుత్సాహం ప్రదర్శించరాదు. పోక్సో యాక్ట్ నిబంధనలు.. చిన్నారులను లైంగిక వేధింపుల నుండి రక్షించడం. అఘాయిత్యానికి పాల్పడాలన్న ఉద్దేశంతో బాలికను తాకితే అది నేరమే.. అంతేగానీ నేరాన్ని పరిగణలోకి తీసుకునేటప్పుడు.. బాలిక శరీరాన్ని నిందితుడు నేరుగా తాకాడా లేదా దుస్తుల పై నుంచి తాకాడా అన్నది అనవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది.
కేసు వివరాలివి..
సతీష్ అనే వ్యక్తి ఓ బాలికకు పండ్లు ఇస్తానని ఆశ పెట్టి.. తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో వెళ్లిన తర్వాత బాలిక ఛాతీని తాకుతూ ఆమె డ్రెస్ విప్పేందుకు యత్నించాడు. దీంతో బాలిక గట్టిగా కేకలు వేయడంతో.. బాధితురాలి తల్లి అక్కడికి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన 2016లో జరిగింది. ఆ తర్వాత నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. ఆ తర్వాత నిందితుడు ముంబై కోర్టును ఆశ్రయించాడు. కేసు విచారణ నాగ్‌పూర్ బెంచ్ మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలా వివాదాస్పద తీర్పును వెలువరించారు.
బాలిక శరీరాన్ని డ్రెస్‌పై నుండి తాకినంత మాత్రన లైంగిక వేధింపులకు గురి చేసినట్లు చెప్పలేమన్నారు. బాలిక డ్రెస్ తొలగించి, లేదా డ్రెస్ లోపల చేయి పెట్టి నేరుగా శరీరాన్ని తాకితేనే లైంగిక వేధింపుల కిందకు వస్తుందని తీర్పు వెలువరించారు. అప్పట్లో ఈ తీర్పుపై పెద్ద ఎత్తున సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. బాలల హక్కుల కార్యకర్తలు, న్యాయ నిపణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. అటార్నీ జనరల్, జాతీయ మహిళ కమిషన్.. ముంబై కోర్టుఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ ఏడాది జనవరి 27న ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును భారత ఉన్నత న్యాయస్థానం నిలిపివేసింది.