భారత భద్రతా దళాలు జమ్మూ కశ్మీర్ లో తీవ్రవాదులను అంతం చేసుకుంటూ వెళుతున్నాయి. అవంతిపోరాలోని తిల్వాని మొహల్లా వద్ద బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మృతుడిని జైషే మహ్మద్ కమాండర్ షామ్ సోఫీగా గుర్తించారు. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్న అధికార వర్గాలు తెలిపాయి. ఇంకొంత మంది ఉగ్రవాదులు దాక్కున్నట్లుగా భావిస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఆ ప్రాంతంలో మరిన్ని బలగాలను పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు.
గత మూడు రోజుల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగడం ఇది ఆరోసారి. భద్రతా బలగాలు ఇప్పటి వరకు ఎనిమిది మంది ఉగ్రవాదులను హతమార్చాయి. మంగళవారం పోషియాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎల్‌ఈటీతో సంబంధాలున్న ఐదుగురు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. ఇటీవలి కాలంలో సాధారణ ప్రజలను టార్గెట్ చేసుకుని కొందరు తీవ్రవాదులు దాడులకు తెగబడుతూ ఉన్నారు. అలాంటి వారిని ఏరివేయడమే లక్ష్యంగా భారత భద్రతాదళాలు టార్గెట్ గా పెట్టుకున్నాయి.