తప్పు చేశామని ఒప్పుకున్న తమిళనాడు ప్రభుత్వం

తమిళనాడులోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) కొత్త లాంచ్ కాంప్లెక్స్‌లో 'చైనీస్ జెండా'తో కూడిన ప్రకటనతో వివాదం చెలరేగిన

By Medi Samrat  Published on  1 March 2024 2:29 PM IST
తప్పు చేశామని ఒప్పుకున్న తమిళనాడు ప్రభుత్వం

తమిళనాడులోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) కొత్త లాంచ్ కాంప్లెక్స్‌లో 'చైనీస్ జెండా'తో కూడిన ప్రకటనతో వివాదం చెలరేగిన ఒక రోజు తర్వాత, డీఎంకే నాయకురాలు, మత్స్య శాఖ మంత్రి అనితా ఆర్ రాధాకృష్ణన్ చిన్న తప్పు అని అంగీకరించారు. డిజైనర్ చేసిన పొరపాటు అని ఆమె అన్నారు. దీన్ని చిన్న పొరపాటుగా పేర్కొన్న రాధాకృష్ణన్.. దీని వెనుక డీఎంకేకు ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేశారు. ప్రకటనలో ఒక చిన్న పొరపాటు జరిగింది.. మాకు వేరే ఉద్దేశాలు లేవు.. మా హృదయాలు భారతదేశం పట్ల ప్రేమతో మాత్రమే నిండి ఉన్నాయని రాధాకృష్ణన్ వార్తా సంస్థ ANI తో తెలిపారు.

తమిళనాడు రాష్ట్ర అధికార పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) ఫిబ్రవరి 28న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి MK స్టాలిన్, DMK లోక్‌సభ ఎంపీ కనిమొళి కరుణానిధి, ఇతర పార్టీ నాయకులతో మొదటి పేజీ మొత్తం వార్తాపత్రిక ప్రకటనలను ఇచ్చింది. ఆ ప్రకటనలో IRSO రాకెట్ చిత్రానికి బదులుగా చైనీస్ రాకెట్ చిత్రాన్ని ఉపయోగించారు. రాకెట్ పైభాగంలో ఎరుపు రంగు జెండాపై పసుపు నక్షత్రాలు ఉన్నాయి. ప్రకటనలో ఉపయోగించినవన్నీ విదేశీ రాకెట్లు.. భారత్ కు చెందిన ఒక్క రాకెట్ కూడా డీఎంకే ప్రకటనల్లో కనిపించలేదు. చంద్రయాన్ 3తో సహా దేశంలోని విజయవంతమైన అంతరిక్ష ప్రాజెక్టులలో పాల్గొన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను డీఎంకే ప్రభుత్వం అవమానించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన దేశాన్ని, దేశభక్తులైన మన అంతరిక్ష పరిశోధకులను డీఎంకే ప్రభుత్వం ఘోరంగా అవమానించిందని మోదీ మండిపడ్డారు. దేశ ప్రగతిని, అంతరిక్ష రంగంలో భారతదేశం సాధించిన విజయాలను ప్రశంసించడానికి డీఎంకే ఏ మాత్రం సిద్ధంగా లేదని అన్నారు.

Next Story