చైనాకు ఊహించని షాక్ ఇచ్చిన భారత్

Tiranga Flies High In Galwan Valley. నూతన సంవత్సరం రోజున వాస్తవాధీన రేఖ వెంబడి గల్వాన్ లోయలో చైనా జెండాను

By Medi Samrat  Published on  4 Jan 2022 4:03 PM IST
చైనాకు ఊహించని షాక్ ఇచ్చిన భారత్

నూతన సంవత్సరం రోజున వాస్తవాధీన రేఖ వెంబడి గల్వాన్ లోయలో చైనా జెండాను ఎగరేసినట్లుగా వీడియోలను చైనాకు చెందిన జర్నలిస్టులు షేర్ చేశారు. కొత్త సంవత్సరం రోజునే గల్వాన్ లోయలో చైనా పతాకం రెపరెపలాడిందంటూ చైనా అధికారిక మీడియా జర్నలిస్ట్ షెన్ షివె ట్వీట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. గల్వాన్ లోయ నుంచి చైనా ప్రజలకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు శుభాకాంక్షలు తెలియజేశారంటూ ట్వీట్ చేశారు. గల్వాన్ గొడవ జరిగిన ప్రాంతం నుంచి 1.2 కిలోమీటర్ల దూరంలో చైనా జెండాను ఎగరేసినట్టు గూగుల్ ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. అయితే చైనాకు ధీటుగా భారత సైన్యం జవాబిచ్చింది.

గల్వాన్ వ్యాలీలో చైనా జెండాను ఆవిష్కరించిన రోజునే మన సైన్యమూ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించింది. దానికి సంబంధించిన ఫొటోలు విడుదలయ్యాయి. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ లో ఫొటోలను తాజాగా పోస్ట్ చేశారు. నూతన సంవత్సరం రోజున ధీశాలులైన భారత జవాన్లు గల్వాన్ లోయలో జెండా ఎగరేశారంటూ కామెంట్ చేశారు. 2020లో తూర్పు లడఖ్ లోకి అక్రమంగా ప్రవేశించిన చైనా సైనికులు.. మన దేశంతో గొడవకు దిగిన సంగతి తెలిసిందే. గల్వాన్ లోయలో మన జవాన్లపై ఘర్షణకు దిగడంతో కర్నల్ సంతోష్ బాబు సహా 20 మంది జవాన్లు మరణించారు.


Next Story