ఉగ్రవాదులు ప్రాణాలతో ఉండరు.. సెలెక్టివ్‌గా హతమారుస్తాం : అమిత్ షా

ఉగ్రవాదాన్ని దాని మూలాల నుంచి పెకిలించివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.

By Medi Samrat
Published on : 1 May 2025 6:39 PM IST

ఉగ్రవాదులు ప్రాణాలతో ఉండరు.. సెలెక్టివ్‌గా హతమారుస్తాం : అమిత్ షా

ఉగ్రవాదాన్ని దాని మూలాల నుంచి పెకిలించివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సెలెక్టివ్‌గా ఉగ్రవాదులను హతమార్చనున్న‌ట్లుగా తెలిపారు. ఉగ్రవాదంపై ప్రభుత్వం ఏమాత్రం సహనం పాటించదన్నారు. దాడి చేసిన ఉగ్రవాదులు ప్రాణాలతో ఉండరని అన్నారు. ఉగ్రవాదం అంతమయ్యే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. ఉగ్రవాదాన్ని దాని మూలాల నుంచి నాశనం చేస్తామ‌న్నారు.

ఢిల్లీలో ఓ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ.. ఈరోజు కైలాష్‌ కాలనీలో బోడోఫా విగ్రహాన్ని ఆవిష్కరించి రోడ్డును ఆవిష్కరించే అవకాశం లభించడం నా అదృష్టం అని అన్నారు. ఈ విగ్రహం బోడో కమ్యూనిటీకే కాకుండా వారి భాష, సంస్కృతి మరియు అభివృద్ధి కోసం పోరాడిన చిన్న తెగలందరికీ కూడా ముఖ్యమైనది. బోడోఫా విగ్రహం బోడో కమ్యూనిటీకే కాకుండా అలాంటి చిన్న తెగలందరికీ గౌరవాన్ని తెస్తుందన్నారు.

90ల నుంచి కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నడుపుతున్న వారిపై జీరో టాలరెన్స్ విధానంపై మనం గట్టిగా పోరాడుతున్నామని ఈ రోజు నేను ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఈ రోజు వారు (ఉగ్రవాదులు) మన పౌరుల ప్రాణాలను తీయడం ద్వారా యుద్ధంలో గెలిచినట్లు భావించకూడదు. ఈ పోరాటం ముగిసిపోలేదని, ప్రతి ఒక్కరికీ తగిన సమాధానం చెబుతామని భయభ్రాంతులకు గురిచేస్తున్న వారికి నేను చెప్పాలనుకుంటున్నానని హెచ్చ‌రించారు.

ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే ప్రతి వ్యక్తికి సెలెక్టివ్ సమాధానం లభిస్తుందని అన్నారు. ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వం అని, ఎవరినీ వదిలిపెట్టబోమని అన్నారు. ఈ దేశంలోని ప్రతి అంగుళం నుండి ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే మా సంకల్పం.. అది నెరవేరుతుందన్నారు.

పహల్గామ్‌ దాడి తర్వాత భారత్‌-పాక్‌ మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొంది. పాకిస్థాన్‌పై భారత్ నిరంతరం చర్యలు తీసుకుంటోంది. ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదలబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఏ ఉగ్రవాదిని విడిచిపెట్టబోమని చెప్పారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అనే విధానంపై ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

Next Story