పెళ్లి చేసుకోబోతున్నాననే ఆనందంలో ఉన్న అతడు.. ఆపండి.. సినిమా స్టైల్లో షాక్‌..!

The young man was going to marry again, First wife arrived. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లాలో రెండో పెళ్లి చేసుకోబోతున్న ఓ వ్యక్తికి మొదటి భార్

By Medi Samrat  Published on  2 Dec 2021 4:16 PM IST
పెళ్లి చేసుకోబోతున్నాననే ఆనందంలో ఉన్న అతడు.. ఆపండి.. సినిమా స్టైల్లో షాక్‌..!

ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లాలో రెండో పెళ్లి చేసుకోబోతున్న ఓ వ్యక్తికి మొదటి భార్య ఊహించని షాక్ ఇచ్చింది. అతడి పెళ్లి ఊరేగింపు వద్దకు చేరుకుని వీరంగం సృష్టించింది. జనక్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిశాంత్ కాంబోజ్ అనే వ్యక్తి ఊరేగింపుతో రాధా విహార్‌కు చేరుకున్న సమయంలో మహిళ వచ్చి రచ్చ చేయడంతో.. పెళ్లి కొడుకు కాస్తా కటకటాల పాలయ్యాడు. అతడు పెళ్లి చేసుకోబోయే యువతి జీవితం నిలబడింది. పెళ్లి మండపం నుండి జైలుకు చేరుకున్నాడు.

నిశాంత్‌తో తనకు గత పదేళ్లుగా సంబంధం ఉందని, కోర్టులో పెళ్లి చేసుకున్నారని మొదటి భార్య అని చెప్పుకుంటున్న యువతి ఆరోపించింది. కాంబోజ్ మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు రాగా.. మొదటి భార్య ఈ పెళ్లి చేసుకోవడం ఆపేయాలని బెదిరించింది. దండోలి ఖేడా గ్రామానికి చెందిన నిశాంత్‌తో తనకు పదేళ్లుగా సంబంధం ఉందని ఠానా జనక్‌పురి ప్రాంతంలోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టు వివాహం ద్వారా తాము ఒక్కటయ్యామని మొదటి భార్య తెలిపింది. అయితే, నిశాంత్ కాంబోజ్ తనకు పెళ్లి జరిగిన విషయాన్ని దాచాడు.

అటు తన కోర్టు వివాహం గురించి తన కుటుంబానికి తెలియజేయలేదు.. అలాగే రెండో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కుటుంబానికి కూడా చెప్పలేదు. రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు నిశాంత్ అనే విషయం తెలుసుకున్న మొదటి భార్య పెళ్లి మండపం దగ్గరకు చేరుకుని వీరంగం సృష్టించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిశాంత్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రెండు నెలల క్రితం నిశాంత్ తనకు అబార్షన్ కూడా చేయించాడని మొదటి భార్య ఆరోపించింది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.


Next Story