జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని లాల్ బజార్ ప్రాంతంలో మంగళవారం భద్రతా బలగాలపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ముస్తాక్ అహ్మద్‌గా గుర్తించారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాత్రి 7:15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్‌లో.. శ్రీనగర్ నగరంలోని లాల్ బజార్ ప్రాంతంలో పోలీసుల నాకా పార్టీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడి ఘటనలో ముగ్గురు పోలీసు సిబ్బంది గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టారు. మరిన్ని వివరాలు తెలుపబడుతాయని పేర్కొన్నారు.
మరో ట్వీట్‌లో.. ASI ముస్తాక్ అహ్మద్ తీవ్ర గాయాలతో అమరవీరుడయ్యాడు. విధి నిర్వహణలో అహ్మద్ చేసిన అత్యున్నత త్యాగానికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. గాయపడిన మరో ఇద్దరు సిబ్బంది చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.