జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆగడాలు ఆగడం లేదు. కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇద్దరు వలస కూలీలను కాల్చి చంపారు. ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. వాన్‌పోలోలోని ఓ ఇంట్లోకి ముష్కరులు చొరబడ్డారు. అనంతరం ఆ ఇంట్లో ఉంటున్న వలస కార్మికులపై కాల్పులు జరిపారు. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరు కార్మికులు ఘటన స్థలిలోనే మృతి చెందారు. మరోకరికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతులు బీహార్‌కు చెందిన రాజా రేషి దేవ్, జోగిందర్ రేషి దేవ్‌గా గుర్తించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన చున్ చున్ రేషి దేవ్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పులకు పాల్పడ్డ ప్రాంతం తెలియరాలేదు. విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు ఘటన స్థలాన్ని చుట్టుముట్టాయి.
గత రెండు రోజుల్లో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడడం ఇది మూడోసారి. ఉగ్రవాదుల కాల్పులతో స్థానికుల్లో భయం పట్టుకుంది. శనివారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో గోల్గప్ప వ్యాపారి అరవింద్ శ్రీనగర్‌లోని ఈద్గాలో కాల్చి చంపబడ్డాడు. ఇక పుల్వామాలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కూలీ సాగర్ అహ్మద్ హత్యకు గురయ్యాడు.