ఫ్లై ఓవర్ పై ఓ మైనర్ బాలిక పడిపోయి ఉంది. ఆమెను ఎవరైనా గుద్దారా.. లేక పడిపోయిందా అని చూడడానికి కొందరు వచ్చారు. అయితే అప్పటికే ఆమె తీవ్ర రక్తస్రావానికి గురైంది. ఆమె ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం కావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్‌లోని తిజారా ఫ్లైఓవర్ దగ్గర చోటు చేసుకుంది. పాపం ఆ మైనర్ బాలికను ఎవరో వదిలేసి వెళ్లిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఫ్లైఓవర్ వద్ద మంగళవారం రాత్రి కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి రక్తపు మడుగులో ఉన్న మైనర్ బాలికను అక్కడ వదిలి పెట్టి వెళ్లారు. బాలికను ఐసీయూలో ఉంచి, నిందితులను పట్టుకునేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు ఫ్లైఓవర్‌పైకి వెళ్లి బాలికను అక్కడ దింపారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గమనించిన బాటసారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాలికను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను ఐసీయూలో చేర్చారు. బాలిక విపరీతమైన నొప్పితో బాధపడుతోందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు భావిస్తున్నారు. బాధితురాలు ప్రస్తుతం తీవ్ర భయాందోళనకు గురై మాట్లాడే స్థితిలో లేదని పోలీసులు తెలిపారు. ఆమెను ఆ స్థితికి తీసుకుని వచ్చిన వాళ్లను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరారు.