బీజేపీలో తిరిగి చేరిన తమిళిసై

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం మళ్లీ బీజేపీలో చేరారు. తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు రాజీనామా చేసిన

By Medi Samrat
Published on : 20 March 2024 4:16 PM IST

బీజేపీలో తిరిగి చేరిన తమిళిసై

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం మళ్లీ బీజేపీలో చేరారు. తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు రాజీనామా చేసిన రెండు రోజులకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. “నేను ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాను. నా పార్టీకి కూడా నా కోరికను తెలియజేశాను. తిరిగి బీజేపీ సభ్యత్వం పొందడం నాకు సంతోషంగా ఉంది.. ఇది అత్యంత సంతోషకరమైన రోజు. ఇది చాలా కఠినమైన నిర్ణయం.. సంతోషకరమైన నిర్ణయం కూడా. గవర్నర్‌గా నాకు చాలా సౌకర్యాలు ఉన్నాయి కానీ నేను వాటిని వదిలిపెట్టినందుకు. ఒక్క శాతం కూడా బాధపడను.. తమిళనాడులో కమలం వికసిస్తుంది’’ అని ఆమె అన్నారు.

తమిళనాడు అధ్యక్షుడు కె.అన్నామలై సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. తమిళిసై అంతకుముందు బీజేపీ నాయకురాలు. ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా కూడా పని చేశారు. 2019లో తెలంగాణ గవర్నర్‌గా వచ్చారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు ఆమె తెలంగాణ గవర్నర్ పదవికి, పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.

Next Story