దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి కొన్ని రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతున్నాయి. పలు రాష్ట్రాల్లో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో కూడా కరోనా వ్యాప్తి తీవ్రంగానే ఉంది. కరోనా కట్టడిలో భాగంగా తమిళనాడులో ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ఆదివారం రాత్రి తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా మహమ్మారిపై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు మాస్కు ధరించడం, భౌతిక దూరం ఉండటం వంటివి నిబంధనలు తప్పకుండా పాటించాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు. అన్ని జిల్లాల అధికార యంత్రాంగాలకు తన ఆదేశాల్లో సూచనలు చేసింది.
కాగా, గత 24 గంటల్లో తమిళనాడులో 486 మంది కరోనా వైరస్ బారినపడగా, ఐదుగురు మృతి చెందారని తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ లాక్‌డౌన్‌లో భాగంగా కొన్ని ప్రాంతాల్లో సడలింపులు ఇచ్చారు. అత్యవసర పనుల మినహా లాక్‌డౌన్ ఆంక్షలను విధిస్తున్నారు. అలాగే మాస్కులు ధరించని వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలు కఠినతరం చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు విధిస్తున్న లాక్‌డన్‌కు ప్రజలు సహకరించాలని కోరారు.