మీకు రేషన్ కార్డు ఉందా..? ఉంటే.. సంక్రాంతికి రూ.2500 ప్రభుత్వం ఇవ్వనుంది. అయితే.. ఇది మనకు కాదులెండి. తమిళనాడు వాసులకు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డు లబ్దిదారులకు సంక్రాంతి కానుకగా రూ.2500 చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కిట్ రూపంలో సంక్రాంతి కానుకలను అందించనున్నట్లు సీఎం పళనీ స్వామి వెల్లడించారు. సంక్రాంతి కిట్‌లో రూ.2500లతో పాటు కిలో బియ్యం, కిలో పంచదార, చెరకు గడ, ఎండుద్రాక్ష, 20 గ్రాముల కిస్‌మిస్, 20 గ్రాముల జీడిపప్పు, 5 గ్రాములు యాలకులు అందివ్వనున్నట్లు సీఎం చెప్పారు. దీని ద్వారా సుమారు 2.6 కోట్ల మంది లబ్దిపొందనున్నారు.
కాగా.. సీఎం ప్రకటనపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ విమర్శలు గుప్పించారు. వరదల సమయంలో ప్రజలు కష్టాల్లోఉన్నప్పుడు ఎటువంటి సాయం అందించని సీఎం, ఎన్నికలు సమీపిస్తుండటంతో వరాలు కురిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. లాక్‌డౌన్, వరదల కారణంగా ప్రభావితమైన కుటుంబాలకు రూ.5000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు.