సాధారణంగా ఆలయాల్లో పూజారులుగా పురుషులు ఉంటారు. కానీ తమిళనాడు సర్కార్ తాజా నిర్ణయంతో.. అక్కడి ఆలయాల్లో మహిళా పూజారులు బాధ్యతలు చేపట్టనున్నారు. తమిళనాడు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పౌరోహిత్యంపై ఆసక్తి చూపించే మహిళలకు అందుకు సబంధించి శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం కొత్త కోర్సును కూడా తీసుకువస్తోంది. ఈ విషయమై రాష్ట్ర మంత్రి పీకే శేఖర్ బాబు మాట్లాడుతూ.. హిందువులు ఎవరైనా పూజారులు కావొచ్చన్నప్పుడు మహిళలకూ ఆ అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.