చలించిన సీఎం స్టాలిన్... మనోధైర్యం కల్పిస్తూ వీడియో సందేశం..!

Tamil Nadu CM releases video urging students not to take any drastic decisions.

By అంజి  Published on  16 Sep 2021 4:40 AM GMT
చలించిన సీఎం స్టాలిన్... మనోధైర్యం కల్పిస్తూ వీడియో సందేశం..!

తమిళనాడులో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. గత మూడు రోజుల్లో ముగ్గురు జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌)పై భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి మరణాలపై అక్కడి ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే తమ విద్యార్థులను కాపాడుకునేందుకు నివారణ చర్యలు చేపట్టారు సీఎం స్టాలిన్‌. తాజాగా నీట్‌ ఎగ్జామ్‌ రాసిన 17ఏళ్ల సౌందర్య అనే యువతి.. తాను ప్రవేశ పరీక్షలో అర్హత సాధించలేనేమోనన్న భయంతో బలవన్మరణానికి పాల్పడింది. పరీక్ష రాసిన తర్వాత ఆమె నిరాశకు గురైందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు.

యువతి ఆత్మహత్య చేసుకోవడంపై సీఎం స్టాలిన్ చలించి పోయారు. యువతి మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సీఎం స్టాలిన్‌... విద్యార్థులకు ధైర్యం చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. ' విద్యార్థుల ఆత్మహత్యలు విన్న ప్రతిసారి నా ఛాతీ ఈటెతో గుచ్చుకున్నట్లు అనిపిస్తోందని' సీఎం అన్నారు. విద్యార్థులు జీవితం.. వారి కుటుంబానికి, దేశానికి ఎంతో అవసరమని, విద్యార్థులు ఆందోళన చెందవద్దని, తీవ్రమైన నిర్ణయాలు తీసుకొవద్దని సీఎం స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల కౌన్సెలింగ్ కోసం 104 హెల్ప్‌లైన్‌ నెంబర్‌ను ప్రవేశపెట్టామన్నారు. రాతి హృదయాన్ని కరిగిద్దదామన్నారు. నీట్‌ను రద్దు చేసే వరకు తాము విశ్రమించమని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. విద్యార్థులకు నిరంతరం కౌన్సెలింగ్ ఇస్తామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. ఇందుకోసం 330 మంది వ్యక్తిగత వికాస నిపుణులను నియమించినట్లు మంత్రి తెలిపారు. ఈ సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి.



Next Story