తమిళనాడు హెలికాప్టర్ క్రాష్.. మరో ఆరుగురి మృతదేహాలు గుర్తింపు

Tamil Nadu Chopper Crash.. Identification Of 6 IAF Personnel Completed. తమిళనాడులోని కూనూర్‌లో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సైనిక సిబ్బంది మృతదేహాల్లో.. కనీసం ఆరు మృతదేహాలను గుర్తించడం పూర్తయిందని

By అంజి  Published on  11 Dec 2021 2:21 AM GMT
తమిళనాడు హెలికాప్టర్ క్రాష్.. మరో ఆరుగురి మృతదేహాలు గుర్తింపు

తమిళనాడులోని కూనూర్‌లో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సైనిక సిబ్బంది మృతదేహాల్లో.. కనీసం ఆరు మృతదేహాలను గుర్తించడం పూర్తయిందని, మిగిలిన మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని భారత సైన్యం శనివారం ధృవీకరించింది. బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్, ఆయన డిఫెన్స్ అడ్వైజర్ బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్దర్ సహా కనీసం 13 మంది మరణించారు. భారత వైమానిక దళం (IAF) ప్రమాదంలో.. మరణించిన నలుగురు సిబ్బందిని సానుకూలంగా గుర్తించామని, వారిని త్వరలో వారి సంబంధిత కుటుంబ సభ్యులకు విమానంలో తరలించనున్నట్లు తెలిపింది. లాన్స్‌ నాయక్‌ బి. సాయి తేజ, లాన్స్‌ నాయక్‌ వివేక్ కుమార్‌ల మృత దేహాలను సానుకూలంగా గుర్తించడం జరిగిందని భారత సైన్యం మరింత సమాచారం అందించింది.

"సముచితమైన సైనిక గౌరవంతో అంత్యక్రియల కోసం భౌతిక అవశేషాలు విమానంలో తరలించబడతాయి. బయలుదేరే ముందు ఢిల్లీ కాంట్‌లోని బేస్ హాస్పిటల్‌లో పుష్పగుచ్ఛం ఉంచబడుతుంది"అని పేర్కొంది. మిగిలిన మృత దేహాలను సానుకూలంగా గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని సైన్యం తెలిపింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్‌లకు శుక్రవారం ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. వారి కుమార్తెలు కృతిక, తారిణి అంత్యక్రియలు నిర్వహించారు.

శ్మశానవాటికలో జనరల్ రావత్ సైనిక అంత్యక్రియలకు మొత్తం 800 మంది సేవా సిబ్బంది హాజరయ్యారు. కాగా, 10 మంది సిబ్బంది మృతదేహాలను ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ బేస్ హాస్పిటల్ మార్చురీలో ఉంచారు. మృతదేహాలను "గుర్తించిన" తర్వాత వారి కుటుంబాలకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. "కుటుంబ సభ్యుల మానసిక శ్రేయస్సు మాకు చాలా ముఖ్యమైనది. కాబట్టి ఇందులో ఉన్న సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని గుర్తింపు ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నాం'' అని ఓ అధికారి తెలిపారు.

Next Story